Take a fresh look at your lifestyle.

49‌వ వసంతంలోకి అడుగిడిన ఆర్థికమంత్రి

  • హరీష్‌రావుకు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌
  • ‌కవిత, ఎంపి సంతోష్‌, ‌మంత్రుల శుభాకాంక్షలు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు నేడు. 49వ వసంతంలోకి ఆయన అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హరీశ్‌కు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌ద్వారా హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆర్థికశాఖ మంత్రి, డైనమిక్‌, ‌కష్టజీవి.. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ప్రజా సేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నా బావా అని అన్నారు. రాజకీయంగా గానీ, ప్రభుత్వ ఫోరంలలో గానీ తో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు పెద్దఎత్తున మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేవేళ్ల ఎంపీ రంజిత్‌ ‌రెడ్డి, తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు పూర్తి ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.మంత్రి హరీశ్‌రావుకు ఎంపీ సంతోష్‌కుమార్‌, ‌మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిరువురు ట్విట్టర్‌ ‌ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ… హ్యాపీ బర్త్‌డే బావా అని పేర్కొన్నారు. సంతోష్‌కుమార్‌ ‌స్పందిస్తూ… గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాల్సిందిగా హరీశ్‌ను కోరారు. పుట్టినరోజును పురస్కరించుకుని మరో మూడు మొక్కలకు జీవితాన్నిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!