Take a fresh look at your lifestyle.

బాబ్రీ విధ్వంసం కేసుపై నేడు తుది తీర్పు

  • కోర్టుకు హాజరు కావాలని బిజెపి పెద్దలకు నోటీసులు
  • రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు కేంద్రం ఆదేశాలు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు తుది తీర్పు వెలుబడనున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు  కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ ఆదేశించారు. సీబీఐకి చెందిన లక్నో ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో  నేడు తీర్పును ఇవ్వనున్నది.  ఈ తీర్పు వల్ల శాంతి, భద్రతలపై సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, రెండు వర్గాల చెందిన వారు అల్లర్లకు దిగే అవకాశం ఉందని, అందుకే భద్రతను పెంచాలంటూ కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొన్నది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో నిందితులు దోషులుగా తేలుతారని కొన్ని ముస్లిం సంఘాలు భావిస్తున్నాయని, ఒకవేళ తీర్పు వారి పక్షం లేకుంటే దాడులు జరిగే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది.

మతపరంగా సున్నితంగా ఉండే జిల్లాల్లో భద్రతను పెంచాలని కేంద్రం సూచించింది. బీజేపీ సీనియర్‌ ‌నేతలు ఎల్‌ ‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ ‌జోషి, కళ్యాణ్‌ ‌సింగ్‌, ఉమా భారతిలు ఈనెల 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1992, డిసెంబర్‌ 6‌వ తేదీన అయోధ్యలో కరసేవకులు 16వ శతాబ్దానికి చెందిన మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అద్వానీతో పాటు ఇతరులపై నేరపూరిత కుట్ర కింద ప్రత్యేక సీబీఐ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అద్వానీతో పాటు ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు 2001లో కొట్టివేసింది. దాన్ని 2010లో అలహాబాద్‌ ‌కోర్టు సమర్థించింది. అయితే అలహాబాద్‌ ‌కోర్టు తీర్పును సుప్రీమ్‌ ‌కోర్టు ఓవర్‌రూల్‌ ‌చేసింది. 2017లో అద్వానీతో పాటు ఇతరులపై  నమోదు అయిన నేరపూరిత అభియోగాలను రిస్టోర్‌ ‌చేయాలని ఆర్టికల్‌ 142 ‌ప్రకారం సుప్రీమ్‌కోర్టు ఆ కేసులో ఆదేశించింది. మరోవైపు తీవ్ర జ్వరంతో ఉమాభారతి హాస్పిటల్‌లో చేరారు.

Leave a Reply