Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కొరోనా

  • 24 గంటల్లో కొత్తగా 2,478 కేసులు
  • మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఆంక్షలు..అధికారుల అప్రమత్తం
  • కొరోనా నివారణపై పోలీస్‌ ‌కమిషనర్లు, ఎస్‌పిలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్

‌రాష్ట్రంలో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌లో కేసులు రోజురోజుకూ తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,478 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్కరోజే లక్ష కొరోనా టెస్టులు చేశామని రాష్ట్ర పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు తెలిపారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను రెట్టింపు చేశామని, కొరోనాను ఎదుర్కునేందుకు అందరూ సహకరించాలని శ్రీనివాసరావు కోరారు.  గురువారం నమోదయిన కేసులతో కలిపి మొత్తం 3,21,182కు చేరాయి. 24 గంటల్లో వైరస్‌తో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కొరోనాతో మొత్తం 1,746 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,472 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొత్తగా 402 కొరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్క రోజే 1,01,986 మందికి కొరోనా పరీక్షలు చేశారు. చికిత్స నుంచి కోలుకుని 3,03,964 లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు.

కొరోనా నివారణపై పోలీస్‌ ‌కమిషనర్లు, ఎస్‌పిలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్
ఇదిలావుంటే రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకూ పెరగుతుండడ•ంతో పోలీస్‌ ‌శాఖ అప్రమత్తం అయ్యింది. కొరోనా నివారణ చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పోలీస్‌ ‌కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కొరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సెకండ్‌ ‌వేవ్‌లో కొరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున.. ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొరోనా నివారణ చర్యలు చేపట్టాలని డిజిప్డి సూచించారు. మరోవైపు కొరోనాతో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ‌మృతిచెందాడు. నగరంలోని మోండా మార్కెట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో హసన్‌ అలీ హెడ్‌ ‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 19న కొరోనా బారినపడ్డాడు. అవి•ర్‌పేట్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. ఘట్‌కేసర్‌లోని బాలాజీనగర్‌లో హసన్‌ అలీ నివాసం ఉంటున్నాడు.

మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఆంక్షలు..అధికారుల అప్రమత్తం
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న రెంజల్‌, ‌బోధన్‌, ‌కోటగిరి, వర్ని మండలాల పరిధిలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతుండడంతో జిల్లా సరిహద్దుల్లో మళ్లీ ఆంక్షలు విధించారు. ప్రభుత్వ జనరల్‌ ‌హాస్పిటల్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌లో చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్‌ ‌నగరంలోని 9 ప్రైవేటు హాస్పిటళ్లలో కొరోనాకు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరనివారు ప్రైవేటులో చికిత్స కోసం చేరుతున్నారు. నిజామాబాద్‌ ‌ప్రభుత్వ జనరల్‌ ‌హాస్పిటల్‌లో సుమారు 185 మంది చికిత్స కోసం చేరారు. కొరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు అన్నారు. వాహనదారులకు, ప్రజలకు మాస్క్ ‌ప్రాముఖ్యతతోపాటు కొరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. 45 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా కొరోనా టీకా వేయించుకోవాలని, టీకా పట్ల ఎటువంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కువగా ఈ కరోనా బారిన పడుతున్నారు. మండల, జిల్లాస్థాయి కార్యాలయాలతో పాటు మున్సిపాలిటిల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువగా కొరోనా కేసులు వొస్తున్నాయి. వీరితో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారు ఎక్కువ మంది కొరోనా బారినపడుతున్నారు.

Leave a Reply