సన్న వడ్లకు గిట్టుబాటుధర చెల్లించాలని రైతుల డిమాండ్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఐకెపి సెంటర్ వద్ద సన్న వడ్ల రకంకు మద్దతు ధర కల్పిస్తూ వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ..ధాన్యాన్ని రోడ్డు మీద పోసి నిప్పుపెట్టారు.
20 రోజుల క్రితం సన్నరకం వడ్లను కొనుగోలు సెంటర్కు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని బుధవారం రైతులు ఆగ్రహంతో వడ్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం సెంటర్లో వడ్లు పోసినా కూడా లారీలు వొచ్చి తిరిగి పోవడం జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నరకం వడ్లను సాగుచేయుమని చెప్పిన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని రైతులు ప్రశ్నించారు. ఇప్పటికైనా మద్దతు ధరతో సన్న వడ్లను కొనుగోలుచేయాలని డిమాండ్ చేశారు.