Take a fresh look at your lifestyle.

ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలి

ఖమ్మం  సిటి, మే 21, (ప్రజాతంత్ర విలేకరి) : రైతుబంధు పథకాన్ని వెంటనే అమలుచేయడంతో పాటు లక్ష రూపాయల రైతుబుణమాఫీకి వెంటనే  చర్యలు తీసుకోవాలని డిమాండ• చేస్తూ భారతీయ జనతాపార్టీ ఖమ్మం రూరల్‌శాఖ అధ్యక్షులు ముళ్ల మాధవరావు ఆధ్వర్యంలో గురువారం తాహశీల్దార్‌కు వినతిపత్రం అందజే సారు. ఈ సందర్బంగా  బిజెపి జిల్లా అధ్యక్షులు సన్నె ఉదయ్‌‌ప్రతాప్‌ ‌మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ రైతుబంధు వర్తింపచేయాలన్నారు. రైతులకు గతంలో వాగ్దానం చేసినవిధంగా లక్ష లోపు బుణాలను మాఫీకి చర్యలు తీసుకోవాలని కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో రైతుబుణ మాఫీ అమలుచేస్తామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా నేటికి జరగలేదన్నారు. వ్యవసాయ  పనులు ప్రారంభమైన నేపధ్యంలో పెట్టుబడులకు ఎదురుచూస్తున్నారన్నారు. అందుకే వెంటనే లక్ష రూపాయలు గలవారికి బుణమాఫీ వెంటనే చేయాలని కోరారు. ఈ బణాలు వెంటనే మాఫీ చేసి మరల కొత్త బుణాలు ఇచ్చేందుకు చర్యలు కూడా తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి కోండపల్లి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు కావాల్సిన బుణమాఫీ కాకుండా రైతుబంధును బంద్‌ ‌చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఇలా చేస్తే తాము రైతుపక్షాన పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో వీరెల్లి లక్ష్మయ్య, దేవరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

గరిడేపల్లిలో…
గరిడేపల్లి, మే 21(ప్రజాతంత్ర విలేకరి) : రైతుబంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని మాజీ మార్కెట్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌పోకల వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా నాయకులు అందె కోటయ్య డిమాండ్‌ ‌చేశారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ ‌కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు కింద డబ్బులు ఏ ప్రాతిపదిక రైతుల ఖాతాల్లో జమ చేశారో అదే ప్రాతిపదికన ప్రస్తు తం కొత్తగా అర్హులైన వారితో పాటు, రైతులం దరికీ గత రెండు సీజన్లు, ప్రస్తుత సీజన్‌తో కలిపి ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన విధంగా ఎకరాకు రూ.5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అదే విధంగా రై తులందరికీ రూ.రుణాలు మాఫీ చేయాలన్నారు. రెండో విడత టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చి 18 నెలలైనా నేటికీ రైతు రుణమాఫీ చేయలేదని, వెంటనే మాజీ చేసి కొత్త రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు సుందరి రమేశ్‌, ‌రాజు, ఎడవెల్లి బాటసారి, బెల్లంకొండ •పేందర్‌, ‌బాలకృష్ణ, శివ పాల్గొన్నారు.

రామన్నపేటలో…
రామన్నపేట, మే21 (ప్రజాతంత్ర విలేకరి) ఏకకాలంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్‌. ‌మొగులయ్య, కార్యదర్శి కే.వెంకటేశ్వరాచారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌, ‌జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్‌ ‌సుందర్‌ ‌రావు ఇచ్చిన పిలుపుమేరకు గురువారం నాడు స్థానిక తహశీల్దార్‌ ‌శ్రీనివాస్‌ ‌కుమార్‌ ‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రైతు రుణమాఫీ, రైతు బంధు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధోరణికి నిరసనగా మెమోరండం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాటిపాముల శివకృష్ణ గౌడ్‌, ‌డోగిపర్తి సుభాష్‌, ‌గర్దాస్‌ ‌సురేష్‌, ‌శానగొండ బిక్షమాచారి,  వనం అంజయ్య, కొమ్ము యాదయ్య, దావునూరి వెంకటేశం, కట్కూరి బిక్షపతి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy