ప్రభుత్వం నిర్దేశించిన పంటలు వేస్తేనే రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏనుమాముల మార్కెట్ కి క్రయ విక్రయాలు నిలిచి 65 రోజుల తర్వాత తిరిగి జిల్లా కలెక్టర్, వర్థన్నపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు మేయర్ తో కలిసి బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటతో నష్టం కాకూడదనే ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి చొరవతో, అతి పెద్ద ఏనుమాముల మార్కెట్ క్రయవిక్రయాలను ప్రారంభించినట్లు పేర్కొ న్నారు. వరంగల్ పత్తి, మిరపకు తెలంగాణ పత్తి అంటే కూడా దేశవ్యాప్తంగా మంచి డిమాండు ఉన్నదన్నారు. రైతులు పండిం చిన పంటకు మద్దతు ధర రావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా నియంత్రణ పంటల సాగు చేస్తేనే లాభదాయకంగా ఉంటుందని తద్వారా ఆర్థిక బలోపేతం కావాలనే ముఖ్య మంత్రి ఉద్దేశ్యం నెరవేరుతుందని ఎర్రబెల్లి అన్నారు. ముఖ్యమంత్రి రైతు పక్ష పాతి కాబట్టే వ్యవసాయ రంగ ఉన్నతికి తెలంగాణ ఏర్పడిన ప్పటి నుండి ఆయన దృష్టంతా రైతు, వ్యవసాయం పురోగతి సాధించాలనే సంకల్పం తో ఉన్నారన్నారు.
ప్రభుత్వం సూచించిన పంట సాగు చేస్తే భవిష్యత్తులో రైతును ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని అందుకే మొక్క జొన్న లేకుండా వానాకాలంలో లాభసాటి వ్యవసాయా నికి పత్తి సన్న రకం వడ్లు వేయాలని తెలంగాణ సోన షుగర్ లెస్ కాబట్టి ఎక్కువ డిమాండు ఉండే అవకాశం ఉందన్నారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మెన్ రోజువారీగా సమీక్షించి పండించిన పంటకు నష్టం జరగకుండా చూడా లని ఆదేశించారు. పసుపు మార్కెట్ కూడా ఓపెన్ చేయాలని అనుకున్న అట్టి వ్యవస్థ కేంద్రం చేతిలో ఉన్నందున ఈ విషయం సిఎం దృష్టికి తీసుకెళ్ళి పసుపు రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామనీ మంత్రి అన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్, వరంగల్ అర్బన్, జనగామలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సేజ్ లను ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఒక్కొక్క సెజ్ కు వెయ్యి ఎకరాల భూమి అవసరం భూసేకరణ చర్యలు చేపట్టాలని సంభందిత అధికారుల ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సెజ్ ల ద్వారా రైతుకు పండించిన పంటకు డిమాండు పెరుగుతుందని అన్నారు. మంత్రి పత్తి, మిర్చి యార్డులో పర్యటించి క్రయ విక్రయాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి యార్డులో సోడియం హైపో క్లో రైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈకార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరీ రమేష్, నగర మేయర్ గుండా ప్రకాశరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, మార్కెట్ కమిటీ సభ్యులు, సెక్రెటరీ మార్కెట్ శాఖ ఉప సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.