Take a fresh look at your lifestyle.

కొలువుల జాతర నిరుద్యోగులను మోసగించడమా? ఎమ్మెల్సీ ఎన్నికల వోట్లకా ??

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై నిరుద్యోగుల ఉద్యమ వేదిక 2016 నుంచి పోరాడుతున్నా కేసీఆర్‌ ‌కు చీమ కుట్టినట్లు లేదు… పదేళ్ళుగా పబ్లిక్‌ ‌సర్వీస్కమిషన్‌ ‌కార్యాలయం ఎదుట ధర్నాలు చేసినా ఒక్క నోటిఫికేషన్‌ ‌లేదు, పుష్కరంగా జూనియర్‌ ‌లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నోటిఫికేషన్లకూ గతిలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, టి ఎస్‌ ‌పి ఎస్‌ ‌సి ఛైర్మన్‌, ఎమ్మెల్యేలు, గవర్నర్‌ ‌కి ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా దిక్కులేదు. గ్రూప్‌1, ‌గ్రూప్‌2, ‌జూనియర్‌ ‌లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల కోసం 10 -15 ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు వాళ్ళ వితం అవిటి. పెళ్లిళ్లు కాక, పెళ్ళైనవాళ్ళు అనేక ఇబ్బందులతో మానసిక సమస్యలు అనుభవిస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హడావుడిగా ఢిల్లీ వెళ్లివచ్చి 50 వేల కొలువుల మేలా అనడం దేనికి సంకేతం, మరోసారి నిరుద్యోగులను మోసగించడమేనా.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా 50వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఎందుకీ కసరత్తు? వాస్తవానికి ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.

రాష్ట్రం ఏర్పడగానే గోల్కొండ కోటలో, 2015 లో అసెంబ్లీలో, 2014, 2017, 2018లో అసెంబ్లీలో ప్రకటనలు. 2018 ఎన్నికల్లో ఎన్నిసార్లు హామీనో లెక్కలేదు. రెండు లక్షలుపైగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఇప్పుడు భర్తీచేస్తున్నది 50వేలా.. టీచర్‌, ‌పోలీసు, ఇతర పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎస్కు ఆదేశాలా… పోలీస్‌, ‌విద్యాశాఖ లోనే 70 వేలకుపైగా, ఇతర శాఖల్లో మరో 75 వేలకుపైగా ఖాళీలుండగా, నెలకు 600 మంది వంతున ఆరేళ్ళలో 43 వేల మంది రిటైరయ్యారు. కొత్త జిల్లాలు, కొత్త మండల్లాలో మరో 30 వేల ఉద్యోగ ఖాళీలు. ఇదీ వ్యవహారం.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్య మంత్రి సమీక్షించారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? అత్యవసరంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఏమిటి? వివరాలు తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల వరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలతోపాటు పోలీస్‌ ‌శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల పైగా పోస్టులు ఖాళీలుంటే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడంపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేసి, తీవ్రంగా ఖండించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు కార్యాలయాలు, విద్యాసంస్థలు, పోలీస్స్టేషన్లలో సరిపడా సిబ్బందిలేరు. ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్న ఉద్యోగుల మీద పనిభారం పెరుగుతోంది. ఆర్భాటంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన సర్కార్‌ ‌కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. గడచిన ఆరేళ్ళలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది 35,724 పోస్టులు మాత్రమేనని కమిషన్‌ ‌చైర్మన్‌ ‌ఘంటా చక్రపాణి తాజాగా ప్రకటించారు. పోలీస్‌, ‌గురుకులాలతోపాటు పంచాయ తీరాజ్శాఖలోనూ కొన్ని పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది కానీ జంబో నోటిఫికేషన్‌ ‌జారీ చేయలేదు. . కొత్తగా ఏర్పడిన జిల్లాలు, డివిజన్లు, మండలాలకు మాత్రం కొత్త కేడర్‌ అలాట్‌ ‌చేయలేదు. పాత కేడర్నే కొత్త చోట్లకు సర్దుబాటు చేసి, చేతులు దులుపుకున్నారు. విద్యాశాఖలో 37,559 పోస్టులు ఖాళీగా ఉండగా.. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ‌లో 24,702 టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌పోస్టులున్నాయి.

హయ్యర్‌ ఎడ్యుకేషన్లో 12,857 టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2016లో యూనివర్సిటీల్లో 323 ప్రొఫెసర్‌, 687 అసోసియేట్‌ ‌ప్రొఫెసర్లు, 518 అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌పోస్టులు ఖాళీ ఉన్నా ఇప్పటికీ భర్తీ చేయలేదు. మెడికల్‌, ‌ఫ్యామిలీ హెల్త్ ‌శాఖలో 23,512 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్‌ ‌పోస్టులే 2,200 పైగా ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లోని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఎస్సీ వెల్ఫేర్లో 5,534, ట్రైబల్‌ ‌వెల్ఫేర్లో 5,852, బీసీ సంక్షేమశాఖలో 1,027 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.రెవెన్యూశాఖలో 8,118, పంచాయతీరాజ్లో 5,929 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

జోనల్‌ ‌విధానం తేల్చకుండా పోస్టుల భర్తీ ఎలా చేస్తారు. 2018 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్త జోనల్విధానం అమల్లోకి వచ్చింది. ముందుగా స్థానికత, కేడర్‌ ఆధారంగా మల్టీ జోన్లు, జోన్లు, జిల్లా స్థాయిలో ఉద్యోగులను విభజించాలి. జోనల్‌ ‌విధానం అమల్లోకి వచ్చి డున్నరేండ్లు దాటినా ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టలేదు. టీచర్‌ ‌పోస్టుల కు టెట్‌ ‌పరీక్ష తెలంగాణ వచ్చాక రెండు సార్లే నిర్వహించారు. టెట్‌ ‌వ్యాలిడిటీ ఏడేండ్లు. గతంలో వ్యాలిడిటీ పూర్తయినవారు, టెట్‌ ‌క్వాలిఫై కానివాళ్లు కలిపి 4 లక్షల మందికి పైగా టెట్‌ ‌కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌ ‌పెట్టకుండా టీచర్‌ ‌పోస్టులను భర్తీ చేయడం కుదరదు. త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే 50 వేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారని నిరుద్యోగులు అంటున్నారు. నిరుద్యోగులను మోసం చేస్తే మరొక నిరుద్యోగ తెలంగాణ ఉద్యమ తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

గొంగరెడ్డి వెంకటరెడ్డి
నిరుద్యోగుల ఉద్యమ వేదిక వ్యవస్థాపక చైర్మన్‌
‌తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర యూత్‌ ‌ప్రధాన కార్యదర్శి

Leave a Reply