Take a fresh look at your lifestyle.

వెలిగొండ ప్రాజెక్టును సత్వరంగా పూర్తి చేయాలి

సిపిఎం సమావేశంలో వక్తల డిమాండ్‌
ఒం‌గోలు,జూలై 2 : వెలిగొండ నీళ్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి సిపిఎం రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య డిమాండ్‌ ‌చేశారు. 2021 సెప్టెంబర్‌ ‌నాటికి పూర్తి చేస్తామన్న హాని పూర్తి చేయాలన్నారు. సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం పొదిలి సిపిఎం కార్యాలయంలో దగ్గుపాటి సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాలాఅంజయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ ‌రెడ్డి ఎన్నికలకు ముందు వైయస్సార్‌ ‌పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని, వెలిగొండ ప్రాంత పరివాహక ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని, గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసిందని నమ్మబలికారని అన్నారు.

కానీ జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ వెలుగొండ ప్రాజెక్టు నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అన్నారు. 2021 సెప్టెంబర్‌ ‌నాటికి నీరు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని, లేనియెడల చంద్రబాబు ప్రభుత్వానికి, వైయస్సార్‌ ‌ప్రభుత్వానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పట్ల పెద్ద తేడా ఏమి ఉంటుందని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ ‌పూర్తయిందని ఆర్భాటంగా ప్రకటించారని, ఆగస్టు, సెప్టెంబర్‌ ‌వర్షాకాలం సీజన్‌ ‌లో నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అన్నారు.

వెలుగొండ నిర్వాసితులకు నష్ట పరిహారం కొరకు 1300 కోట్ల రూపాయలు బ్జడెట్లో ప్రకటించారని, కానీ నిర్వాసితులకు ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌ప్యాకేజీ పరిహారం చెల్లించడంలో ఎందుకు నమేషాలు లెక్కిస్తుందని, వెంటనే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, సెప్టెంబర్‌ ‌నాటికి నీరును విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సమావేశంలో సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్‌, ‌సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గాలి వెంకటరామిరెడ్డి, పీవీ శేషయ్య, ఎం రమేష్‌, ‌పీసీ కేశవరావు, జి బాలనాగయ్య, ఊసా వెంకటేశ్వర్లు, ఆవులయ్య, డికేయం రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply