Take a fresh look at your lifestyle.

ఫీజుల దోపిడీని అరికట్టాలి

ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరిట జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ‌చింతకింది సంతోష్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సంతోష్‌ ‌మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరుట జరుగుతున్న ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆన్‌లైన్‌ ‌క్లాసులను నిర్వహిస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలన్నారు.

అదేవిధంగా ఉపాధ్యాయులను తొలగించిన ప్రైవేట్‌ ‌కార్పోరేట్‌ ‌పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్‌ ‌బోర్డు అనుమతి లేకుండా కరోనా సమయంలో అక్రమంగా అడ్మిషన్స్ ‌నిర్వహిస్తున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తదితర విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉల్లెంగుల రాజు, పొన్నాల రమేష్‌, ‌తిరుమల్‌రెడ్డి, కార్తీక్‌, ‌మనోజ్‌, ‌జాషువపాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!