ఈ యూనివర్శిటీలో ప్రగతి శీల భావాలు గల విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టాన్నీ, ఎన్ఆర్సీనీ వ్యతిరేకించడంలో ముందున్నారు. విద్యార్థుల దృష్టిని మళ్ళించడం కోసమే ఈ విద్యార్థులు, అధ్యాపకులపై ఇనుపరాడ్లతో దాడి జరిగిందేమోననిపిస్తోంది. అసమ్మతిని అణచివేయడానికి కంకణం కట్టుకున్న వర్గాలు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు. ఈ విధమైన కిరాతక దాడులు విద్యార్ధుల్లో అసమ్మతిని అణచివేయడానికి పథకం ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోంది.
రత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు క్రూరత్వాన్ని మరుగునపరిచే మరియు మద్దతునిచ్చే భాషపై తిరుగుబాటుతో మొదలవుతుంది. మన మనస్సాక్షి నిద్ర పోతుంటే, క్రూరమైన దాడులను పట్టించుకోకుండా ఉంటే కొత్త ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి విద్యార్ధులు, అధ్యాపకులపై ముసుగు వీరులు జరిపిన దాడుల వంటివి జరుగుతూనే ఉంటాయి. తప్పు చేసే వారికి మనస్సాక్షి ఉండదు. దేశంలో ప్రగతిశీల భావాలు గల విద్యార్థులు, అధ్యాపకులపై ఇలాంటి దాడులు జరగడం కొత్త కాదు. మన దేశంలో తాజా పరిస్థితులకు ఇవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జామియా మిలియాలో విద్యార్థుల నిరసనలను బలవంతంగా అణగదొక్కిన పోలీసులు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలోకి ముసుగు వీరులు చొచ్చుకుని వొచ్చి జరిపిన దాడిని పట్టించుకోలేదు.(సీసీ ఫుటేజిలే ఇందుకు నిదర్శనం)ఈ దాడి చాలా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా జరిగింది.
అధికారంలో ఉన్న వారి ఆశీసుస్సులు, అండదండలు లేనిదే ఇలాంటి దాడిని ఎవరూ చేయలేరు. విద్యా సంస్థల్లో తమకు నచ్చని సిద్ధాంతాలకు చెందిన వారిపై దాడులకు అవకాశం ఇస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. జెఎన్యూ విద్యార్థులకు తగిలిన గాయాలు చూస్తుంటే విద్యార్థులు తమలో తాము ఘర్షణ పడినవిగా కనిపించడం లేదు. ముసుగులో వొచ్చిన వారు బయట వ్యక్తులై ఉంటారన్న అనుమానం బయటపడుతోంది. తమ సిద్దాంతాలు నచ్చని వారి పట్ల ఎంత క్రూరంగానైనా వ్యవహరిస్తారని ఈ ఘటన రుజువు చేస్తోంది.
సైద్ధాంతిక వైరుధ్యాలు సహజమే కానీ, ప్రత్యర్థుల నోళ్ళు నొక్కేయడానికి ఇంత దారుణమైన దాడులకు పాల్పడటం అనేది 2014 నుంచి జరుగుతోంది. ఇదే యూనివర్శిటీలో గొడవలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ యూనివర్శిటీలో ప్రగతి శీల భావాలు గల విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టాన్నీ, ఎన్ఆర్సీనీ వ్యతిరేకించడంలో ముందున్నారు. విద్యార్థుల దృష్టిని మళ్ళించడం కోసమే ఈ విద్యార్థులు, అధ్యాపకులపై ఇనుపరాడ్లతో దాడి జరిగిందేమోననిపిస్తోంది. అసమ్మతిని అణచివేయడానికి కంకణం కట్టుకున్న వర్గాలు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు. ఈ విధమైన కిరాతక దాడులు విద్యార్ధుల్లో అసమ్మతిని అణచివేయడానికి పథకం ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోంది. ప్రశ్నించడాన్ని నేరంగా పరిగణించే అసహన ధోరణులు ప్రబలుతున్నాయి. అధికారంలో ఉన్న వారి ప్రోత్సాహం, అండదండలు వీరికి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి ధోరణులను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితంగా వయ్వహరించడం అత్యవసరం,
మేము కూడా చూస్తాం…
మేము కూడా చూస్తాం…
నిర్బంధ, అణచివేత శిఖరాలు
దూది పింజల్లే ఎగిరి పోయే
క్షణాలను మేము కూడా చూస్తాం… -ఫయిజ్
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్