Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌చేతకాని తనం వల్లనే కృష్ణా నీష్ణనీటి తరలింపు

  • ఎపి అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపరేం
  • గిరిజన సమస్యలపై కానరాని చిత్తశుద్ది
  • కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి, సంపత్‌

‌విభజన చట్టంలోని హక్కులను సాధించటంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ ‌చేతకానితనం వల్లే ఏపీ సీఎం జగన్‌ ‌కృష్ణానది జలాలను తరిలించుకుపోతున్నాడని అన్నారు. వీటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. దీంతో దక్షిణ తెలంగాణ ఎడారి కానుందన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌ ‌వివక్ష చూపిస్తున్నారంటూ కాంగ్రెస్‌  ‌నేత కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

ఆర్డీఎస్‌పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటే, అడ్డుకోవాల్సిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌ ‌దృష్టి ఎప్పటికైనా.. వోట్లు,..సీట్లపైనే ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర నీటి వాటాలను దోచుకుంటుంటే జిల్లా మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఏవి• చేయలేని దద్దమ్మలుగా ఉన్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్‌ ‌చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నారని, కేసీఆర్‌కు తెలియకుండా ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను కేసీఆర్‌ అడ్డుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలో వి•డియాను రోడ్డు పైకి నెట్టడం దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా వి•డియాపై ఇలాంటి ఆక్షలు లేవని సంపత్‌ ‌కుమార్‌ ఆరోపించారు.

ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని లేకుంటే కాంగ్రెస్‌ ‌పోరాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషను ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ ‌గిరిజనుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. గిరిజనుల రిజర్వేషన్ల అమలుపై పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు లేవు. నిరుద్యోగ భృతి అమలుకు మాత్రమే కొరోనా అడ్డు వస్తుందని సీఎం చెప్పటం సిగ్గుచేటు. గిరిజనులకు జరిగిన నష్టాన్ని పూరించటానికి సూపర్‌ ‌న్యూమరిక్‌ ‌పోస్టులను సృష్టించాలి. తెలంగాణ నిరుద్యోగుల్లో ఉన్న ఆందోళనలను కేసీఆరే తొలగించాలి. మొక్కజొన్న కొనుగోలు మార్క్ ‌ఫెడ్‌ ‌ద్వారానే చేయాలి. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించటంలో కేసీఆర్‌ ‌కేంద్రంతో పోటీ పడుతున్నారు. నిజాం చెక్కర కర్మాగారాన్ని పూర్తిగా మూసివేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

దాదాపు 30 రోజులు జరపవలసిన బడ్జెడెట్‌ ‌సమావేశాలను ఆరు రోజులకే పరిమితం చేయడంపై ఆయన మండిపడ్డారు. కేవలం ఆరు రోజుల్లోనే సమావేశాలు పూర్తి చేయడం ద్వారా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌పాలన నియంతృత్వ పాలనలా ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలనలా లేదన్నారు, శాసనసభా సమావేశాలు కేవలం అలంకార ప్రాయంగా మారిపోయాయి తప్ప… అర్థవంతమైన చర్చలు జరగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగం, నీటిపారుదల, కృష్ణానదివి•ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదన్నారు. అప్పులను ప్రభుత్వం విపరీతంగా చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌కింద కేటాయించిన నిధులను వినియోగించకుండా.. వాటిని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply