Take a fresh look at your lifestyle.

ఒమిక్రాన్‌పై అప్రమత్తం అయిన ఎపి సర్కార్‌

  • ఉన్నతస్థాయి సక్షించిన సిఎం జగన్‌
  • ఇం‌టింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ ‌వేయాలని ఆదేశం
  • ఫీవర్‌ ‌సర్వేను కొనసాగించాలని ఆదేశాలు
  • ఆస్పత్రుల్లో సిబ్బందిని పూర్తిగా భర్తీ చేయాలి
  • జనరల్‌ ‌బదిలీలకు సిఎం గ్రీన్‌ ‌సిగ్నల్‌

అమరావతి, డిసెంబర్‌ 27 : ఒమిక్రాన్‌ ‌విజృంభించడంతో ఎపిలో జగన్‌ ‌సర్కార్‌ అ‌ప్రమత్తం అయ్యింది. సోమవారం దీనిపై సిఎం జగన్‌ ఉన్నతస్థాయి సక్ష చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ ‌చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్‌పై సీఎం సక్ష ఏర్పాటు సంద్భంగా సీఎం మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీలో 6 ఒమైక్రాన్‌ ‌కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో జనరల్‌ ‌బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలని ఆదేశించారు. కోవిడ్‌ ‌నియంత్రణ, నివారణ వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ ‌కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.‌

జగన్‌ ‌సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్‌ ‌బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు.. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వైద్యం పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కోవిడ్‌ ‌వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగాలలోని ఆస్పత్రులను కూడా దీనికి సిద్ధంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. వ్యాక్సినేషన్‌ ‌పక్రియను మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు.ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ ‌చేయాలన్నారు.

ఫీవర్‌ ‌సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ ‌చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ ‌కేసులున్నాయని అధికారులు తెలిపారు. వీరిలో ఎవరు కూడా ఆస్పత్రిపాలు కాలేదని తెలిపారు. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం భయాందోళనలు అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతరత్రా ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశర చేశారు సీఎం జగన్‌. ‌కోవిడ్‌ ‌కేసుల డేటాను పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ ‌సర్వే తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు. సక్షలో ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్‌ (‌నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌, ‌కోవిడ్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ ఛైర్మన్‌ ఎం ‌టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ ‌మేనేజిమెంట్‌ అం‌డ్‌ ‌వ్యాక్సినేషన్‌) ‌ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) ‌శశిభూషణ్‌ ‌కుమార్‌, 104 ‌కాల్‌ ‌సెంటర్‌ ఇం‌ఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ‌కాటమనేని భాస్కర్‌, ‌వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ ‌నవీన్‌ ‌కుమార్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply