Take a fresh look at your lifestyle.

ముగిసిన పుర పోరు నామినేషన్ల పర్వం

The end of Pura Poor Nominationsజిల్లా పరిధిలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగ ర్‌, ‌నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో గత మూడు రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ శుక్రశారం  ముగిశాయి. జిల్లా పరిధిలోని ఆయా మున్సిపాలిటీలో మూడు రోజుల్లో 141 వార్డులకు గాను ఐదు వందల పైచిలుకు నామినేషన్ల సేట్లను ఆశావహులు నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారని అధికారులు ఇచ్చిన సమాచారం. అధికార టిఆర్‌ఎస్‌ , ‌ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీలు  జరగబోయో మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్యాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వ్యూహా రచనలు చేస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌, ‌ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీలతో పాటు బిజెపి, సిపిఐ(ఎం), సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) ‌న్యూడెమో క్రసీ, టిజెఎస్‌, ‌టిడిపిలకు చెందిన ఆశావహులు ఏలాంటి భరోసా లేకుండా  అసక్తి గల అభ్యర్ధులు గందరగోళంలో నామినేషన్ల పత్రాలను దాఖలు చేశా రు. టిఆర్‌ఎస్‌లో  అసమ్మతి నేతలు మాత్రం ఒక్కోక్క వార్డు నుండి సుమారు ఐదుగురు చోప్పున నామినేషన్లు దాఖలు  చేశారు.

జిల్లాలోని కాంగ్రెస్‌కు పట్టున్న మున్సిపాలిటీలపై దృష్టి సారించి అధికార  పార్టీని ఢీ కొట్టేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పావులు కదులుపు తున్నారు. గత ఆరు సంవత్సరాలల్లో సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమా లను చూపుతూ ఓటర్ల  ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ దిశా, నిర్ధేశం చేసి హెచ్చరికలు జా రీ చేసిన విషయం తెలిసిందే.  దీంతో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇంచార్జీలకు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు సవాల్‌గా మారింది. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి  టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆరు సంవత్సరాల పరిపా లనలో ఎక్కడ అభివృద్ది చేసిన దాఖలాలు లేవని, కేవలం ముఖ్యమంత్రి ఎన్నికల ఎత్తుగడేనని,  మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిధులను కాజేసి అవినీతి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. అదే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు ఆయా మున్సిపాలిటీల్లో వెంచర్లు చేసి మున్సిపాలిటీకి రావాల్సి 10శాతం భూమిని ఇవ్వకుండా కాజేశారని ఆరోపిస్తు న్నారు. జరగబోయో మున్సిపాలిటీ  ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌, ‌ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మద్యే తీవ్ర పోటీ కనిపిస్తోంది.

Tags: suryapet kodhada, uttam kumar reddy, trs party, trs vs t congress, municipal elections

Leave a Reply