Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా ఇంటి స్థలాలు చేసి అమ్మితే క్రిమినల్‌ ‌కేసులు పెడతామని తహశిల్దార్‌ ‌మహేశ్వరరావు హెచ్చరించారు. గురువారం తహశిల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలాల్లో కొంతమంది భూములు ఆక్రమించి సాగుచేసు కోవడమే కాకుండా వాటిని అమ్మి డబ్బు చేసుకుం టున్నారని ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతు న్నాయన్నారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ బైండోవర్‌ ‌చేసుకొని క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటే అన్ని రకాల పత్రాలు అంద జేస్తున్నామని, లేనిపక్షంలో వారికి తెలియజేసు్త న్నామని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని కొంతమంది కావాలనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. మండ లంలో పెండింగ్‌లో ఉన్న పట్టాలను గ్రామాల వారీగా గుర్తించి మండ లం లో పనిచేసే సిబ్బంది వారి గ్రామానికి వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి న్యాయప రంగా ఉన్న భూములకు పట్టాలు అందజేస్తామని ఆయన తెలియజేశారు.

Leave a Reply