Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్‌ ‌రావు కృషితో.. సిద్ధిపేటలో స్వచ్ఛ బడి

  • దక్షణ భారతదేశంలోనే రెండవది
  • చెత్త సేకరణ.. ప్రజారోగ్యంపై పాఠాలు
  • నేడు ప్రారంభించనున్న మంత్రి హరీష్‌ ‌రావు

తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ‌గణీతం, సైన్సు, సోషల్‌ ‌సబ్జెక్టుల గురించి పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. కానీ, చెత్త సేకరణ, ప్రజారోగ్యం, తడి,పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్‌ ‌నివారణ, చెత్తతో ఇళ్లలోనే ఎరువు తయారీ చేసే విధానాలను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా  సిద్దిపేటలోని ఈ స్వచ్ఛబడికి వెళ్లాల్సిందే. ఆదిశగా మంత్రి హరీష్‌ ‌రావు ప్రత్యేక చొరవతో  దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత మన సిద్దిపేటలోనే ‘స్వచ్ఛబడి’ని ఏర్పాటు చేశారు.

 

త్వరలోనే చెత్త గురించిన పాఠాలు చెప్పనున్నారు. పాత ఎంసీహెచ్‌(‌మెటర్నిటీ) హాస్పిటల్‌లో అన్ని హంగులతో ఈ బడిని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వర్గాల వారికి ఇక్కడ డిజిటల్‌ ‌క్లాసుల్లో పాఠాలు బోధించి, ఆ తర్వాత ప్రాక్టికల్‌గా  వివరిస్తారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో బెంగళూరుకు చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త శాంతి  ఈ స్వచ్ఛబడిని పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం మంత్రి హరీష్‌ ‌రావు స్వచ్ఛ్ ‌పాఠశాలను ప్రారంభించనున్నారు.

Leave a Reply