Take a fresh look at your lifestyle.

దూరమైన మధ్యతరగతి ప్రజల స్వప్నం

సొంత ఇల్లు నిర్మించుకోవాలని, పిల్లలకు ఉన్నతమైన విద్య అందించాలని,  విలాసవంతంగా ఉండకపోయినా సౌకర్య వంతంగా జీవితం సాగాలని కోరుకుంటారు మధ్య తరగతి ప్రజలు. తాము సంపాధించే ఆదాయం ఎంత చిన్న మొత్తమైన సరే అందులో కొంత భాగం భవిష్యత్‌ అవసరాల కోసం, కనీస అవసరాల సముపార్జన కై కేటాయిస్తారు.  ఎటువంటి ఆర్థిక ఒత్తిడిలో అయిన కేటాయింపులో కోత పెట్టేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి ప్రజలు కోవిడ్‌ ‌మహ మ్మారి వల్ల తీవ్ర ంగా భంగపడ్డారు. అభి వృద్ధి చెందుతున్న భార తదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలో మధ్య తరగతి ప్రజల పాత్ర కీలకం.

ఆర్థికవ్యవస్థ కదలికకు దోహద పడే వినియోగ వ్యయం ను శాసించే శక్తి భారతీయ మధ్యతరగతి ప్రజలకు ఉందని స్వయంగా కార్పొరేట్‌ ‌సంస్థలే వివిధ సందర్భాలలో వ్యక్తపరిచిన సంఘటనలు అనేకం. మధ్య తరగతి ప్రజల ప్రధాన ఆయుధం పొదుపు. విపత్కర పరిస్థితులలో కూడా అవసరమైతే  ఒక పూట పస్తులుండి, పొదుపు నిల్వలను కాపాడుకుంటారు మధ్యతరగతి ప్రజానికం. మన దేశంలో సింహభాగం మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్‌ ‌రంగంలో ఉద్యోగం పనిచేయడం మరియు మారుతున్న జీవన వ్యయానికి సరిపడు వేతనం లభించని పరిస్థితుల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కావాల్సిన సౌకర్యాలను ( ఉదాహరణకు టీవీ, వాహనాలు, ఫర్నిచర్‌ ‌మొదలగునవి ) ఈ.ఎం.ఐ. ల ద్వారా సమకూర్చుకుంటూ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పరి రక్షిస్తున్నారు.

ఇలాంటి సమయంలో, 2020లో కొరోనా రూపంలో వచ్చిన ఉపద్రవంతో ఈ వర్గానికి చెందిన ప్రజల ఆశలు అడియా శలయ్యాయి. ఉపాధి కోల్పోవడం, ఆదాయక్షీణత, భవిష్యత్‌ అనిశ్చితి, లాంటి సమస్యలతో ఏడాదిన్న రకాలంగా ప్రజలు పొదుపు మంత్రాన్ని దాదాపు మర్చి పోయారు. సరియైనఉపాధి అవకాశాలు దొరకకపోవడంతో దాచుకున్న డబ్బును నిత్యావసరాలకై వినియోగించుకుంటున్నారు. కొంతమంది ప్రజలు. మరికొంత మంది ఆదాయాలు కోల్పోవడంతో ఈ.ఎం.ఐల భారాన్ని మోయలేక ఆస్తులను తిరిగి అమ్మేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేట్‌ ‌బడుల్లో ఫీజులు కట్టలేక పోవడంతో, ప్రభుత్వ పాఠశాలలవైపు మ్రొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్పణం, పెరుగుతున్న నిత్యా వసరధరలు, మరింత క్షోభకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. కొరోనా మహమ్మారి వల్ల చాలా మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. కొరోనా మహమ్మారి,  లాక్‌లౌన్లు ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవనోపాధిని నాశనం చేయడంతో, గత సంవత్సర కాలంలో సుమారు 23 కోట్లమంది భారతీయులు పేదరికంలోకి నెట్టబడ్డారని అజీమ్‌‌ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వెలువరించిన నివేదిక తెలిపింది. అంతేకాక, గ్రామీణ పేదరికం రేటు 15 శాతం పాయింట్లు, పట్టణ పేదరికం రేటుదాదాపు 20 పాయింట్ల మేర పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి .

ఈ విధంగా కరోనా మధ్య తరగతి ప్రజల భవిష్యత్‌ ‌స్వప్నంను అందనంత దూరానికి చేర్చిందని చెప్పవచ్చు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్దీపనలు పరిశ్రమలు, బ్యాంకింగ్‌ ‌ర•ంగానికి ఊతమిచ్చే విధంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు వాటిల్లిన నష్టాన్ని మాత్రం పూడ్చ లేని స్థితిలో ఉన్నాయి.

dr-md
డాక్టర్‌ ఎం‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌అం‌డ్‌ ‌ఫైనాన్స్
9492791387

Leave a Reply