ఇద్దరిపై కేసులు నమోదు..
షాద్ నగర్: ఓ కుక్క పెట్టిన పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇందులో ఇద్దరిపై కేసులు నమోదు అయ్యాయి . రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని ఫరూఖ్ నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో కుక్క గొడవ వల్ల ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరిపై కేసులు నమోదు అయ్యాయి.
ఫరూక్ నగర్ మండలంలోని బూచ్చిగుడా గ్రామానికి చెందిన శ్రీశైలం తన కుక్కను వెంట పెట్టుకొని పొలానికి వెళ్తున్న సందర్భంలో దారిలో వెంకటయ్య అనే మరో వ్యక్తిపై శ్రీశైలం కుక్క మోరిగింది. రాయితో కుక్కను కొట్టడంతో వెంకటయ్య , శ్రీశైలం మధ్యన ఘర్షణ జరిగింది. దీంతో శ్రీశైలం వెంకటయ్య మరియు సోదరుడైన జంగయ్య పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.