Take a fresh look at your lifestyle.

డిఎంహెచ్‌వో, ఎంజిఎం వైద్యాధికారుల ఆదిపత్య పోరు

చికిత్సకు వెనుకంజ వేస్తున్న అనుమానితులు – ఆసుపత్రి నుండి పారిపోయిన కొరోనా రోగి
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 50కు పైగా పాజిటివ్‌ ‌కేసులు – రానున్న కాలంలో కొరోనా విజృంభన
తప్పుడు సమాచారంతో పట్టించుకొని కలెక్టర్‌

‌వరంగల్‌ ఎం‌జిఎం ఆస్పత్రిలోని కోవిడ్‌ ‌వార్డు నుండి కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తి తప్పించుకోవడం వరంగల్‌ ‌నగరంలో కలకలం రేపుతుంది. అదికారుల మధ్య నెలకోన్న  సమన్వయ లోపం, అససత్వంతోనే కోవిడ్‌ ‌వార్డు నుండి  పెషేంట్‌ ‌తప్పించుకోని వేళ్ళడానే విమర్శుల వెళ్ళువెత్తున్నాయి. వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా డిఎంఅండ్‌హెచ్‌వో, ఎంజిఎం అధికారుల మధ్య నెలకోన్న అదిపత్య పోరు కరోనా  రోగులా పాలిట శాపంగా  మారుతోంది. కొరోనా వ్యాధి నివారణలో కీలకంగా  వ్యవహరించాల్సిన అధికారులు అధిపత్య పోరులో పడి కరోనా రోగులను సరిగా పట్టిచుకోవడం లేదనే విమర్శలు వెళ్ళువెత్తున్నాయి. బాధితుల భారం ఎప్పుడు తప్పించుకుందామా అనుకునే వరంగల్‌  అర్బన్‌ ‌జిల్లా వైద్యాదాధికారుల తీరుతో రోగులు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. మరో వైపు పూర్తి భోరోసా ఇవ్వాల్సిన ఎంజిఎం అధికారులు మొక్కబడిగా వ్యవహరించడంతో రోగులు ఎంజిఎం నుండి పారిపోయె స్థితికి చేరుకుంది. వరంగల్‌ ‌నగరానికి చెందిన శంబుని పేటకు చెందిన 28 ఏళ్ళ యువకుడికి జ్వరం, జలుబు రావడంతో స్థానికంగా ఉన్న అర్బన్‌ ‌హెల్త్ ‌సెంటర్‌కి వెళ్ళాడు. అతన్ని గమనించిన  స్థానిక వైద్యులు కొరోనా లక్ణణాలు ఉన్నాయని, ఎంజిఎం ఆస్పత్రికి వెళ్ళాలంటూ సూచించారు. దీంతో  ఎంజిఎం ఆస్పత్రికి వచ్చిన అతన్ని ఆస్పత్రిలో చేర్చుకోని కొరోనా టెస్టులు చేసి వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంజిఎం వార్డు నుండి ఆ వ్యక్తి బుధవారం సాయంత్రం ఎవరికి చెప్పకుండా ఎంజిఎం నుండి పారిపోయాడు. దీంతో అర్బన్‌ ‌జిల్లా డిఎంఅండ్‌హెచ్‌ఓ అధికారులకు, పోలీసులకు ఎంజిఎం కొరోనా వార్డు ఇన్‌చార్జి సమాచారం ఇచ్చారు. దీంతో అతని ఆడ్రస్‌ ‌కోనం పోలీసులు రాత్రంతా వెతికి చివరికి ఉదయం గుర్తించారు. నేరుగా జిల్లా వైద్యాధికారుల సహకారంతో గురువారం ఉదయం ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఉదయం డ్యూటికి వచ్చిన వైద్యుల కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ కాలేందంటూ మళ్ళి ఆ యువకుడిని డిశ్చార్జి చేశారు. ఎంజిఎం నుండి వెళ్తున్న అతడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోని ఎంజిఎం ఉన్నాతాధికారులకు అప్సగించారు. జిల్లా వైద్యాదికారులు సరిగా చర్యలు తీసుకోపోవడంతో కరోనా పాజిటివ్‌ ‌వ్యక్తి ఎంజిఎం నుండి రెండో రోజు కూడా తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. పోలీసులు సరిగా స్పందించి ఉండకుండా ఉంటే కరోనా పేషెంట్‌ ‌బయటకు వెళ్ళే పరిస్థితి ఏర్పడేది. ఈ సంఘటనతో ఎంజిఎం అధికారులకు, అర్బన్‌ ‌జిల్లా వైద్యాధికారులకు మధ్య ఏర్పడిన సమన్వయలోపానికి  ఇదో నిదర్శనం అనే ఆరోపణలు వస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 50కి చేరిన కొత్త కేసులు:
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 50 కొత్త కేసులు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకే పెద్ద దిక్కైన వరంగల్‌ ఎం‌జిఎం ఆస్పత్రిలో కారోనా కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ నేపద్యంలో మొన్నటి వరకు కొరోనా పాజిటివ్‌ ‌వస్తే చాలు హైదరాబద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ కేసుల సంఖ్య  పెరగడంతో గాంధీ ఆస్పత్రి పై భారం తగ్గించేందుకు గత వారం రోజుల నుండి కరోనా పాజీటివ్‌ ‌కేసులకు వరంగల్‌ ఎం‌జిఎంలోనే చికిత్స అందించాలని నిర్ణయించారు.  కానీ వరంగల్‌ ఎం‌జింఎంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే   వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా వైద్యాధికారులు అనుమానితులను తీసుకొచ్చి ఎంజిఎంలో చేర్పిస్తున్నారు.  దీంతో కరోనా వార్డులో చికిత్స పొందుతున్న  కరోనా బాధితులు భయ భ్రాంతులకు లోనవుతున్నారు.  కరోన వార్డులో కనీస సౌకర్యలు కల్పించకుండా సరైనా సెక్యూరిటిని పెట్టకుండా కరోనా వార్డులో పెద్ద సంఖ్యలో రోగులను పెట్టడంతో రోగులు హడలి పోతున్నారు. నిజానికి కరోనా పాజిటివ్‌ అని తెలియగానే జిల్లా వైద్యాధికారులు ఆ రోగికి వారి కుటుం• సభ్యులకు ఓ భరోసా కలిగించి చికిత్సతో నయం అవుతుంది అనే దైర్యం ఇచ్చేలా కౌన్సింగ్‌ ఇవ్వాలి కాని, ఇలాంటివి ఏవి చేయకుండా నేరుగా కరోనా లక్షణాలు కనిసిస్తే చాలు అనుమానితులను నేరుగా తీసుకోని వచ్చి ఎంజిఎం ఆస్పత్రిలో చేరించి చేతులు దులుపుకుంటున్నారు. మరో వైపు ఎంజిఎంలో కూడా  పూర్తి స్థాయి వసలుతులు లేకపోవడంతో  కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎంజిఎం ఆస్పత్రిలో ఉండలేక ఏకంగా  పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంజిఎం అధికారులు మాత్రం మానసిక ఒత్తిడికి లోనై పారిపోతున్నారని చెబుతున్నారు. ఎంజిఎంలో నెలకొన్న అ సౌకర్యాల వల్ల చికిత్స చేయించుకునేందుకు కొరోనా అనుమానితులు వెనుకంజ వేస్తున్నారు.   ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్ళి లక్షలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు.

క్షిణించిన ముగ్గురి ఆరోగ్యం:
వరంగల్‌ ఎం‌జిఎం  ఆస్పత్రిలో ముగ్గురి ఆరోగ్యం క్షిణించడంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్సత్రికి తరలించారు, జిల్లా వైద్యాధికారు సమన్వయంతో సహకరించాల్సిన పరిస్థితిలో భారం అంత ఎంజిఎం పై పడవేసి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు కలెక్టర్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారు.  ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఎం‌జిఎం కొరోనా వార్డును సందర్శంచ లేదని తెలుస్తోంది. అక్కడ వసలుతు ఎమీ ఉన్నాయో కూడా ఆరా తీయలేదు. జిల్లా వైద్యాధికారులు ఇచ్చే సమాచారం పైనే కలెక్టర్‌ ఆధారపడుతున్నారు. దీంతో కరోనా వార్డులో కలిపించే వసతులను పట్టించుకోకపోవడంతో  మెరుగైన చికిత్స పేరుతో ఎంజిఎం అధికారులు  గాందీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం కేసులు తక్కవగా నమోదు అవుతున్నాయి. రానున్న కాలంలో వీటి సంఖ్య రోజు రోజుకు పెరిగేఅవకాశాలున్నాయి. గత వారం పది రోజల్లోనే ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో 50కు పైగా పాజిటివ్‌ ‌కేసులు  నమోదయ్యాయి. మరో వారం పది రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ జిల్లా కలెక్టర్‌ ‌మాత్రం ఎంజిఎంపై దృష్టి పెట్టకపోవడానికి కారణం జిల్లా వైద్యాధికారులే అనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఎంజిఎం అధికారులకు వరంగల్‌ ఆర్బన్‌ ‌జిల్లా వైద్యాదికారుల మధ్య నెలకొన్న ఆదిపత్య పోరుతో రోగుల పై పడుతుంది ఎంజిఎం సిబ్బంది ఆరోపిస్తున్నారు. కొరోనా రోగులుకు చికిత్స అందిస్తున్న ఎంజిఎంలోని కొరోనా వార్డులో లోపాల పైనా ఇప్పటి కైన జిల్లా కలెక్టర్‌ ‌దృష్టి సారిస్తే తప్ప ఈ సమస్యలు  పరిష్కారం కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply