Take a fresh look at your lifestyle.

పంచాయితీ నిధుల దారి మళ్లింపు అబద్ధం

దేశంలోనే అత్యంత గౌరవప్రదంగా ఉన్నది మన సర్పంచ్‌లే
ముక్రా కే గ్రామానికి జాతీయ అవార్డు
ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌సిఫార్సు మేరకే కేంద్రం నిధులు
సభ్యులు ఏదిపడితే అది మాట్లాడడం తగదు
శాసనభలో విపక్షాల తీరుపై సిఎం కెసిఆర్‌ ‌మండిపాటు

‌గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు అనేది సత్యదూరమని సీఎం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ పల్లెలను మాత్రమే అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం, పంచాయితీలను బలోపేతం చేయడం, మౌలిక వసతులను కల్పించడం, శ్మశాన వాటికలను నిర్మించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. పంచాయతీరాజ్‌ ‌చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామన్నారు. గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తప్పుబట్టారు. ‘శాసనసభలో సభ్యుల మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది.  కొన్ని సందర్భాల్లో జాలి పడాల్సి వొస్తుంది. ఏదిపడితే అది అడ్డగోలుగా మాట్లాడితే సరికాదు. తెలంగాణలోని సర్పంచ్‌లు దేశంలోనే అత్యంత గౌరవంగా బతుకుతున్నారు. గర్వంగా తల ఎత్తుకునే సర్పంచ్‌లు ఉన్నారంటే మన వాళ్లే. మన సర్పంచ్‌లను కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసించారు. కొన్ని సందర్భాల్లో ప్రధాని, నీతి ఆయోగ్‌ ‌కూడా ప్రశంసించి అనేక అవార్డులు ఇచ్చింది. ముఖ్రా కే గ్రామానికి అవార్డు వొచ్చింది. దాదాపు రెండు గంటల పాటు పంచాయతీరాజ్‌ ‌చట్టం గురించి వివరించడం జరిగింది.’ అని కెసిఆర్‌ అన్నారు. గులాబ్‌ ‌తుఫాను దృష్ట్యా మూడు రోజులపాటు వాయిదా పడిన అసెంబ్లీ శుక్రవారం పునఃప్రారంభం అయింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నిధులపై సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరుపై సీఎం కేసీఆర్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌సభ్యుల మాటలు వింటే జాలేస్తోందని కేసీఆర్‌ అన్నారు. దేశంలోనే మన రాష్ట్రంలో సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ ‌హయాంలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో రూ.650 విడుదల చేస్తున్నమన్నారు. కాంగ్రెస్‌ ‌హయాంలో సర్పంచ్‌లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారని, ఇప్పుడు సర్పంచ్‌లు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. కొరోనా టైంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపాం కానీ.. పంచాయతీలకు నిధులు ఎక్కడా ఆపలేదన్నారు. తెలంగాణలో గ్రామాల అభివృద్ధి చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదు. ‘వి•రు అద్భుతంగా మాట్లాడండి. వి• కంటే అద్భుతంగా మేం చెప్పగలుగుతాం. మన ఇద్దరి కన్న అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తమ గ్రామాలు చూసి రాష్ట్ర ప్రజలు తన్మయం చెంది పులకించిపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లు బాధపడ్డ మాట వాస్తవం. ఇవాళ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నారు. గర్వపడుతున్నారు’ అని సిఎం వివరించారు. కొరోనా లాంటి ఇతర సందర్భాల్లో డబ్బులకు ఇబ్బంది వొస్తే అవసరం అనుకుంటే శాసనసభ్యులు, మినిస్టర్ల జీతాలు ఆపమన్నాను. కానీ పంచాయతీ గ్రాంట్‌ ‌రిలీజ్‌ ఆపొద్దని తాను చెప్పానని, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వొస్తున్నాయో ప్రతిపక్షాలకు తెలియదా? అంటూ ప్రశించారు. ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌చెప్పిన ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందని, ప్రత్యేకంగా కేంద్రం నుంచి వొచ్చే నిధులేమి ఉండవని, ఇది వారి అవగాహనలోపమని కెసిఆర్‌ ‌దుయ్యబట్టారు. కేంద్రం దయాదాక్షిణ్యాల వి•ద నిధులు రావన్నారు. ‘కొన్ని చోట్ల వనరులు ఉంటాయి.

కొన్ని చోట్ల వనరులు ఉండవు. ఏజెన్సీ ఏరియాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అన్ని గ్రామపంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం చేయాలో ఆలోచించాం. మేధావులు, మంత్రివర్గం ఆమోదం తర్వాత పంచాయతీరాజ్‌ ‌చట్టాన్ని సభ ముందుకు తెచ్చాం’ అని అన్నారు. నిధుల దారి మళ్లింపు అనేది సత్యదూరమని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాటలకు సీఎం కేసీఆర్‌ ‌సమాధానమిస్తూ..సర్పంచ్‌ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్య మేస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లను పట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. కానీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామన్నారు. శాసనసభలో సభ్యులు సత్యదూరమైన విషయాలు మాట్లాడారని సీఎం కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. ‘పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘకాలిక చర్చ పెట్టండి’ అని స్పీకర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. మేము అన్నది తప్పకుండా చేసి చూపిస్తాం. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీ లకు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. నూతన పంచాయతీరాజ్‌ ‌చట్టంలో ఆ ప్రస్తావనే లేదు. ఆ చట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుదల జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని, సర్పంచ్‌లకు సర్వ స్వేచ్ఛ ఇచ్చామని, అన్ని హక్కులు కల్పించామని అన్నారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించాం. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీల్లో అవినీతి జరిగింది. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వర్షాకాలం వొచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మరణాలు సంభవించేవి. ఇప్పుడు అన్ని సీజనల్‌ ‌వ్యాధులు, డెంగీ లాంటి విషజ్వరాలు తగ్గిపోయాయి. గ్రామాల రూపురేఖలను మార్చేశామని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో అడ్డగోలుగా మాట్లాడితే సరికాదని కాంగ్రెస్‌ ‌సభ్యులను ఉద్దేశించి కేసీఆర్‌ అన్నారు. ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారంటూ ఎమ్మెల్యే సీతక్క చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎవరు గొంతు నొక్కుతున్నారు? వి•రు బ్రహ్మాండంగా.. అద్భుతంగా మాట్లాడండి.. మేం వి•కంటే అద్భుతంగా మాట్లాడతాం. మనకంటే అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు బాధపడిన మాట వాస్తవం. ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారని అన్నారు.

Leave a Reply