Take a fresh look at your lifestyle.

‘ఉపాధి’లో మూడో స్థానంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం,మే 16ప్రజాతంత్ర (ప్రతినిధి) : ఉపాధిహమీ పధకం పనులలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో మూడో స్ధానంలో ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం సత్తుపల్లి నియోజ కవర్గం యాతలకుంట్ల, రేగళ్ళపాడు, బుగ్గపాడు గ్రామంలో చెరువు పూడిక తీత పనులు, పనికి ఆహార పథకం పనులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య జిల్లా కలెక్టర్‌ ఆర్‌.‌వి.కరుణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు కూరగాయలు, బత్తాయి పండ్లు, ఓ. ఆర్‌.ఎస్‌, ‌మజ్జిగ ప్యాకెట్లు, మాస్కులు,సరుకులు పంపిణీ చేశారు. ఉపాధికూలీలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, 1500 వందల రూపాయల నగదు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా రోజురోజుకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా పనులు చేసే ప్రాంతాలలో భోజన సమయంలో సేదతీరెందుకు నీడ కల్పించాలని, త్రాగునీటిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

ఉపాధి హామీ పనుల కల్పనలో ఖమ్మం జిల్లా రా ష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ కూలీలు, పర్యవేక్షకులు తప్పకుండా మాలు ధరించేలా చూడాలని, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసందర్భ:గా మంత్రి కూలీలకు మట్టి తట్టలను ఎత్తారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్‌ ‌స్నేహలత మొగిలి, డి.సి.ఎం.ఎస్‌ ‌చైర్మన్‌ ‌రాయల శేషగిరిరావు, కల్లూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి శివాజి ఎం.పి.పి. హైమావతి, జడ్పీ.టి.సి రామారావు, ఆత్మకమిటీ చైర్మన్‌ ‌హరికృష్ణ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శ్రీలత, తహశీల్దారు మీనన్‌, ‌వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

Leave a Reply