Take a fresh look at your lifestyle.

రేషన్‌ ‌షాపుల్లో శనివారం కూడా నిత్యావసరాల పంపిణీ నిలిపివేత

ఆదివారం నుండి మళ్లీ షురూ
హైదరాబాద్‌ ‌లోని తెలంగాణ రాష్ట్ర డాటా సెంటర్లో హైఎండ్‌ ‌యుపిఎస్‌ను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆన్‌ ‌లైన్‌ ‌సేవలు నిలిపివేయడమైనది. దీనితో పాటు రేషన్‌ ‌కార్డుదారులకు చౌకధర దుకాణాల ద్వారా నిత్యావసరాల వస్తువుల పంపిణీని కూడా శుక్రవారం ఉదయం నుండి శనివారం వరకు నిలిపివేయడం జరిగింది.

ఆదివారం నుండి యథావిధిగా రేషన్‌ ‌పంపిణీ పక్రియ తిరిగి ప్రారంభించండం జరుగుతుందని, సాంకేతిక కారణాలతో జరుగుతున్న అంతరాయానికి రేషన్‌ ‌లబ్దిదారులు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌వి. అనిల్‌ ‌కుమార్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply