Take a fresh look at your lifestyle.

విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు సేకరించాలి

  • అంతరాష్ట్ర చెక్‌ ‌పోస్ట్ ఏర్పాటు, థియేటర్లు, బార్లు మూసివేయాలి: జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌

విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారి వివరాలను, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించి కచ్చితమైన సమాచారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ ‌మనుచౌదరితో కలిసి, జిల్లా కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయం నుండి ఆర్డీవోలు, డీఎస్పీలు, తహసీల్దార్లు ఎంపిడిఒలు, ఏపీఎంలు ఇతర మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌వీడియోకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ కరోనా కోవిడ్‌-19 ‌వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆశావర్కర్లు, ఎఎన్‌ఎం‌లు, పంచాయతీ కార్యదర్శులతో ఇంటింటికీ సర్వే చేయాని మార్చి 1వ తేదీ నుండి విదేశాల నుంచి వచ్చిన వివరాలు సేకరించాలన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు 14 రోజులు ఇంట్లోనే ఉండాలని, వారిని మానిటర్‌ ‌చేయాలని చెప్పారు. కరోనా ప్రత్యేక అధికారిగా డాక్టర్‌ ‌శ్రావణ్‌ను (సెల్‌ ‌నెంబర్‌ 9553942254) ‌నియమించినట్లు చెప్పారు. డివిజన్‌ ‌స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ, డిప్యూటీ డీఎంహెచ్వో, డిఎల్పిఓ, డిఆర్డి ఏపిడి,లతో నాలుగు డివిజన్లకు రాపిడ్‌ ‌రెస్పాన్స్ ‌టీమ్‌తో పర్యవేక్షణ చేయించనున్నుట్లు తెలిపారు. కరోనా అనుమానిత వ్యక్తుల కొరకు జిల్లా కేంద్రంలో వారి కోసం ఐసొలేట్‌ ‌వార్డ్ ఏర్పాటు చేసామని 18 బెడ్‌ ‌లతో ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో 18 అంతర్రాష్ట్ర చెక్‌ ‌పోస్ట్ ‌లు ఉన్నాయని మన జిల్లాలో ఒక అంతరాష్ట్ర చెక్‌ ‌పోస్ట్ ఈగలపెంట లోఏర్పాటు చేయడం జరిగిందని, చెక్‌ ‌పోస్ట్ ‌వద్ద ధర్మల్‌ ‌స్కానర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ అనంతరం అన్ని గదులను డెటాల్‌ ‌తో శుభ్రపరిచి సాయంత్రానికి రూములో తాళాలు వేసి ఉదయం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే టప్పుడు డోర్‌ ‌లను శుభ్రపరిచి ఉంచాలన్నారు పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్‌ ‌పౌడర్‌ ‌శానిటేషన్‌ ‌పనులను గ్రామీణ ప్రాంతంలో గ్రామపంచాయతీ పట్టణ ప్రాంతంలో మున్సిపల్‌ ‌సిబ్బంది ప్రతిరోజు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

కరోనా అవగాహన కల్పించేందుకు ఏదైనా ఇతర సలహాలు అందించేందుకు జిల్లా కేంద్రంలో హెల్ప్ ‌డెక్స్ ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ‌వెల్లడించారు. ఎవరైనా సమాచారం అందించాలంటే 9573500104 హెల్ప్ ‌డెక్స్ ‌నెంబర్‌ ‌కు సంప్రదించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో రెండు రకాల వివరాలను సేకరించాలని మొదటిది విదేశీల నుండి వచ్చిన వారి వివరాలను రెండవది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వివరాలను విడివిడిగా సేకరించి వారికి 14 రోజులపాటు ఇంట్లోనే ఉండేలా అవగాహన కల్పించాలన్నారు ఎవరైనా దగ్గు జ్వరం జలుబు తో బాధపడుతుంటే వెంటనే డాక్టర్‌ ‌ను సంప్రదించి వారికి సరైన అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో టీమ్లను ఏర్పాటు చేయాలన్నారు టీమ్లో ఏర్పాట్లపై తహసిల్దార్‌ ‌పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.గ్రామాల్లో వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తుల తరలింపు అవసరం ఉన్న సదుపాయాలను ఎంపీడీవో పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో మండల విద్యాధికారులు ఉపాధ్యాయులు ఇతర అధికారుల సహకారంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ‌సూచించారు.

జిల్లాలో ప్రజలందరూ మాకేమవుతుందిలే అని అనుకోవద్దు కలెక్టర్‌ ‌సూచించారు ప్రజలకు పలు సూచనల ద్వారా అవగాహన కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ వైరస్‌ ‌విదేశాల నుండి వచ్చిన వారికే కానీ, తెలంగాణలో నివసిస్తున్న ఏ ఒక్కరికీ సోకలేదని కలెక్టర్‌ ‌చెప్పారు. ప్రభుత్వం సూచన మేరకు ఇప్పటికే చాలామంది మాస్క్ ‌లు వాడుతూ, వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారని చెప్పారు. మాస్క్ ‌ల కన్నా చేతి రుమాలు వినియోగించాలని రెండు గంటలకు ఒకసారి వేడినీటిలో డెటాల్‌ ‌వేసి కడుక్కొని మళ్లీ వినియోగించుకోవచ్చని మాస్కల కన్నా చేతి రుమాలలేశ్రేయస్కరమని కలెక్టర్‌ అన్నారు.గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు అవసరమని చెప్పారు.ప్రజలు మాకే మవుతుందిలే అని నిర్లక్ష్యం వదిలి , కఠిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసర ముందన్నారు. థియేటర్లు,బార్లు, మార్చి31వరకుమూసివేయాలని,సభలు,ర్యాలీలు, సెమినార్లు నిర్వహించకూడదన్నారు. ఈ ఏడాది నిర్వహించే ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలు రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ ‌చెప్పారు. ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఎక్కడా నిర్వహించబోమని, ప్రజలంతా లైవ్‌ ‌టెలికాస్ట్ ‌ద్వారానే వీక్షించాలని చెప్పారు. అదేవిధంగా మసీదులు, చర్చిలు, దేవాలయాలతో అన్ని మందిరాల్లోనూ భక్తులను రానివ్వొద్దని కోరారు. అన్ని మతాల పెద్దలూ ప్రజలు క్షేమం కోసం ఈ నియమాన్ని కఠినంగా పాటించాలని చెప్పారు.

ముందు జాగ్రత్త చర్యలే మనకు రక్ష అని కలెక్టర్‌ ‌చెప్పారు. ఈ నెల 31 లోపు జరుపుకునే పెళ్లిళ్లకే అనుమతి అని, ఆ తర్వాత అన్ని ఫంక్షన్‌ ‌హాల్స్ ‌మూసివేస్తామని కలెక్టర్‌ అన్నారు. ఒకవేళ ముందే నిర్ణయించుకున్న పెళ్లిళ్లు ఉంటే తక్కువ జనాభాతో జరుపుకోవాలని సూచించారు. అన్ని విద్యా సంస్థలు మూసి వేయాలన్నారునిత్యవసరాల దుకాణాలు తెరిచే ఉంటాయని అన్నారు.ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి ఆ సరుకులను బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్టులలో శానిటేషన్‌ ‌చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించామన్నారు. ప్రైవేటు క్యాబ్‌ ‌లు, బస్సులు, ఆటోలు శుభ్రంగా ఉంచాలని వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ‌శ్రీధర్‌ అధికారులకు ఆదేశించారు.చైనా లొ అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ నందుకు వ్యాప్తి తగ్గిందని ప్రజలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఈ ‌సందర్భంగా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌ ‌నాయక్‌ ,‌డి ఎమ్‌ ‌హెచ్‌ ఓ ‌సుధాకర్‌ ‌లాల్‌, ‌డాక్టర్‌ ‌సాయినాథ్‌ ‌రెడ్డి, డిపిఓ సురేష్‌ ‌మోహన్‌, ‌సీఈఓ నాగమణి, జిల్లా అధికారులు మోహన్‌ ‌రెడ్డి, అఖిలేష్‌ ‌రెడ్డి, అనిల్‌ ‌ప్రకాష్‌, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డీఎస్పీ మోహన్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy