Take a fresh look at your lifestyle.

సచివాలయ భవనాల కూల్చివేత షురూ

  • భారీ భద్రత ..అర్ధరాత్రి నుంచి ప్రారంభించిన రోడ్లు భవనాల అధికారులు
  • కి.మీ.మేర వాహనాల మళ్లింపు, భారీగా ట్రాఫిక్‌ ‌జామ్ 

దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పక్రియ ప్రారంభమైంది. కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలు పాతవి కావడం, అగ్ని ప్రమాదాలు వంటివి చోటు చేసుకున్నప్పుడు కాపాడే విధంగా సరైన భద్రతా లేవన్న కారణంగా సీఎం కేసీఆర్‌ ‌పాత భవనాలను కూల్చి వేసి అదే స్థానంలో ఆధునిక హంగులతో కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నత స్థాయి అధికారుల బృందం సమావేశమై పాత భవనాలను నేలమట్టం చేసే పనిని ప్రారంభించాలని నిర్ణయించారు. సచివాలయ కూల్చివేతను ఎవరూ అడ్డుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈమేరకు. సోమవారం అర్ధరాత్రి నుంచి రోడ్లు, భవనాల శాఖ ఉన్నధికారుల పర్యవేక్షణలో భారీ ప్రొక్లెయినర్ల సాయంతో భవనాల కూల్చివేత పక్రియ ప్రారంభమైంది.

ముందుగా భారీ ప్రొక్లయినర్ల సాయంతో సీఎం కార్యాలయమైన సమతా బ్లాక్‌ను (సి బ్లాక్‌) ‌కూల్చివేసే పని జోరుగా సాగుతోంది. ఆ తరువాత ఎ, బి, డి, హెచ్‌ ‌బ్లాకుల కూల్చివేతను కొనసాగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సచివాలయ భవనాల కూల్చివేత దృష్ట్యా మంగళవారం ఉదయం నుంచే సచివాలయంలోనికి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. రాష్ట్ర సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్న దృష్ట్యా అటు వైపు వాహనాలు రాకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. సచివాలయ ప్రాంగణానికి అర కి.మీ.చుట్టూ పోలీసులు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు. ఖైరతాబాద్‌ ‌ఫ్లై ఓవర్‌పై రాకపోకలు నిషేధించడంతో పాటు రవీంద్రభారతి, బషీర్‌బాగ్‌, ‌హిమాయత్‌నగర్‌, ‌లక్డీకాపూల్‌, ‌నక్లెస్‌రోడ్‌, ఇం‌దిరాపార్క్ ‌వంటి ప్రాంతాల నుంచి వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు. దీంతో ఆ ప్రాంతాలలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ‌జాం అయింది. మరోవైపు, సచివాలయం కూల్చివేత నేపథ్యంలో తాత్కాలిక సచివాలయంగా ఉన్న బీఆర్కే భవన్‌ ఉద్యోగులకు మంగళవారం సెలవు ప్రకటించారు.

Leave a Reply