Take a fresh look at your lifestyle.

‌భ్రమల ‘‘బడ్జెట్‌ ’’!

అం‌తా అంకెల గారడి
తప్పడు లెక్కల పేరడీ
ఓటు రాబడుల ఒరవడి
ఇదే తాజా బడ్జెట్‌ ‌తీరుబడి

మంత్రి వారి ఉపన్యాసంలో
జాతిని ఉద్ధరించే అభివర్ణణం
అంచనలో మాత్రం డొల్లతనం

ఉపాధి హామీ సబ్సిడీలు
సంక్షేమాలు రాయితీలకు
అడ్డు కోతలు నిలువు గాట్లు

విద్య,వైద్యం,సేద్యంతో పాటు
ప్రభుత్వ ఆదాయ అంగాలను
ప్రైవేటీకరించే కుట్రలు తప్పా
దేశ ప్రగతి ప్రణాళికల మృగ్యం

పెట్టుబడిదార్లకు పెద్దపీటలు
సంపన్న వర్గాలకు వెన్నుదన్ను
కార్పొరేట్లకు ఎర్ర తివాచీ తప్పా
బడుగు జీవికి ఒరిగింది శూన్యం

బడ్జెట్‌ 2020 ‌నివేదిక పేజీల్లో
మహిళల ఊసులు కానరాలే
మధ్యతరగతికి ఊరట ఇవ్వలే
వేతనజీవులకు భద్రత లేములే

నిరుద్యోగులకు ఉపాది చూపలే
సేద్యకారునికి చేయూత అందలే
కరోనా వేధితులకు భరోస దక్కలే
అన్నింటా కట్టుకథల కమామిషులే

ఏతా వాత తేలిందేమంటే ?
నిర్మలా సీతా రామన్‌ ‌బడ్జెట్‌
‌పాలకుల ఎజెండాకు పాంప్లేట్‌
‌కార్పొరేట్‌ ‌శక్తులకు రెడ్‌ ‌కార్పెట్‌
‌సామాన్యులకు  డిసప్పాయింట్‌
(‌కేంద్ర వార్షిక బడ్జెట్‌ ‌పట్ల నిరసిస్తూ
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply