Take a fresh look at your lifestyle.

రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో ముదరిన సంక్షోభం

సచిన్‌ ‌పైలట్‌ ‌సహా ముగ్గురు మంత్రులపై వేటు
సిఎల్పీ సమావేశం గెహ్లాట్‌కు మద్దతు పలికిందని కాంగ్రెస్‌ ‌వ్యాఖ్య
రాజస్తాన్‌ ‌కాంగ్రెస్‌ ‌రాజకీయం మలుపులు తిరుగుతోంది. రాజకీయ సంక్షోభం కీలక దిశగా పయనిస్తోంది. రెండోసారి కాంగ్రెస్‌ ‌లెజిస్లేటివ్‌ ‌పార్టీ భేటీకి డుమ్మా కొట్టిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ ‌సచిన్‌ ‌పైలట్‌పై కాంగ్రెస్‌ ‌వేటు వేసింది. సచిన్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ సీనియర్‌ ‌నేత రణదీప్‌ ‌సింగ్‌ ‌సుర్జేవాల ప్రకటించారు. రాజస్థాన్‌ ‌డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్‌ ‌పైలట్‌ను తొలగించినట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ తెలిపింది. అలాగే రాజస్థాన్‌ ‌పీసీసీ చీఫ్‌ ‌పదవి నుంచి కూడా ఆయనను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్‌ ‌నేత రణదీప్‌ ‌సుర్జేవాలా మంగళవారం ఢిల్లీలో చెప్పారు. ఆ స్థానంలో గోవింద్‌ ‌సింగ్‌ ‌దోతస్రాను నియమించినట్లు తెలిపారు. అలాగే సచిన్‌ ‌పైలట్‌ ‌వెంట ఉన్న ముగ్గురు మంత్రులను కూడా క్యాబినెట్‌ ‌నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. సచిన్‌ ‌పైలట్‌, అతడి సహచరులు కొందరు బీజేపీ కుట్రలో చిక్కుకున్నారని, 8 కోట్ల మంది రాజస్థానీలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేస్తుండటాన్ని తాను చింతుస్తున్నానని రణదీప్‌ ‌సుర్జేవాలా అన్నారు.

ఇది ఆమోదయోగ్యం కాదన్న ఆయన, అందుకే వారిని మంత్రివర్గం నుంచి తప్పించినట్లు తెలిపారు. మరోవైపు మంగళవారం జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్‌ •టల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సచిన్‌ ‌పైలట్‌ ‌హాజరుకాలేదు. దీంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని ఆ భేటీలో పాల్గొన్న 102 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ ‌చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.సీఎం అశోక్‌ ‌గెహ్లాత్‌ ‌నాయకత్వాన్ని బలపరిచిన ఎమ్మెల్యేల డిమాండ్‌తో కాంగ్రెస్‌ ‌చర్యలు చేపట్టింది. సోమవారం జరిగిన మొదటి సమావేశంలో సైతం ఇదే సంఖ్యలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌ప్రకటించారు. కాగా వరుసగా రెండు రోజు సమావేశానికి వందకు పైగా ఎమ్మెల్యేలు పాల్గొనడంతో రాజస్తాన్‌ ‌ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదనే ధీమాలో ఉన్నారు. వాస్తవానికి మెజారిటీ కావాల్సింది 101 మాత్రమే. కాంగ్రెస్‌ ‌వద్ద అంత కంటే ఎక్కువే ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ‌రెబల్‌ ‌నేత సచిన్‌ ‌పైలెట్‌ ‌తన వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. ఇరు పక్షాల నంబర్లకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. జైపూర్‌లోని ఫేయిర్‌మంట్‌ •టల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి భారీ సంఖ్యలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ‌చెబుతున్నట్లు 100కు పైగా ఉన్నారా లేదా అనే స్పష్టత ఇంకా రాలేదు.

Leave a Reply