Take a fresh look at your lifestyle.

వృద్ధిలో క్షీణత సంక్షోభాలకు కారణం

“వాణిజ్య రంగానికి రుణాలు  90 శాతం తగ్గడానికి కారణం ఏమిటో ప్రభుత్వం  ఆత్మశోధన చేసుకోవాలి. గిరాకీ సంక్షోభానికి పెద్ద నోట్ల రద్దు ప్రధాన కారణం. స్వదేశ  డిమాండ్‌లో స్తబ్దత వల్ల భారత ఆర్థిక పరిస్థితి విలోమ స్థితిలో ఉందని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఇటీవల తెలిపారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో ఇలా ఎన్నడూ జరగలేదని ఆయన చెప్పారు. వరుసగా రెండేళ్ళ ఆర్థిక సర్వేలు డిమాండ్‌ను అంచనా వేయలేకపోయాయని ఆర్థిక వేత్తలు తెలిపారు. ప్రజల్లో వినిమయం బాగా తగ్గిపోయింది. 80 కోట్ల మంది ప్రజలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు. డిమాండ్‌ను సృష్టించాల్సిన సంస్థలు సాగిల పడుతున్నాయి.”

The decline in growth is the cause of the crises

భారత్‌ ‌వృద్ధిలో క్షీణత దేశంలో ఆర్థిక సంక్షోభాలకు కారణం అవుతోంది. సరఫరా, గిరాకీల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. వీటిపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమన ప్రభావం మన దేశంపై ఉన్న మాట నిజమే అయినా, మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పడిపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. కేవలం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం పైనా పూర్వపు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపైనే నెపాన్ని నెట్టేయడం సరికాదు. ప్రధానమంత్రి అధికారంలోకి రాక ముందు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏడాదికి కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మాట ఎలా ఉన్నా, ఆయన తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల ఉన్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి చాలా మంది వీధిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం నిజాయితీగా అంగీకరించాలి. ఈ పరిస్థితులకు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకు బ్యాంకుల రుణాల వసూళ్ళ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం, పాత బకాయిలు తీర్చని వారికి కొత్తగా రుణాలు అందించడం వంటి చర్యల వల్ల ఆర్థిక రంగంలో సమస్యలు తలెత్తతున్నాయి. కనీసం వొచ్చే బడ్జెట్‌లో అయినా గ్రామీణ ఉపాధి రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే వలసలను ఆపవచ్చు. ఆర్థిక స్తబ్దత అనేది ఎందుకొస్తోందో ప్రభుత్వానికి తెలియంది కాదు. ప్రభుత్వానికి బకాయి పడిన వారి నుంచి వసూళ్ళ వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గడిచిన నాలుగు త్రైమాసికాల నుంచి వృద్ధి రేటు ఎందుకు పడిపోతోందో ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాలి. ప్రభుత్వం ఆర్థిక మాంద్యం ఒక్క విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాంకుల బకాయిలు వసూళ్ళ విషయంలో తగిన శ్రద్ధ కనిపించడం లేదు. అలాగే, రుణాల పంపిణీలో గత సంవత్సరం కన్నా 2019-20లో ఎందుకు తగ్గిందో సమీక్ష చేయలేదు, వస్తు వినియోగం తగ్గింది. ప్రజల చేతుల్లో డబ్బు ఆడటం లేదు. వస్తువినిమియం, ద్రవ్య వినిమయం ద్వారానే ఆర్థిక సౌష్టతను అంచనా వేయగలం. వాణిజ్య బ్యాంకుల రుణాలు 7 లక్షల కోట్ల నుంచి 90 వేల కోట్లకు పడిపోయింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల పరిస్థితి అలాగే ఉంది.

రెండవ ద్వంద్వ బాలెన్స్ ‌షీట్‌ ‌సమస్య
ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పులివ్వలేకపోవడానికి కారణం బకాయిలను వసూలు చేయలేకపోవడమే. పెరిగిన బకాయిల్లో యూపీఏ హయాం నాటివి కూడా చాలా ఉన్నాయి. బ్యాంకుల మొండి బకాయిలు 10 లక్షల కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా, అందువల్ల మోడీ ప్రభుత్వం రెండవ బ్యాలెన్స్ ‌షీట్‌ ‌ను నిర్వహిస్తోంది. అంటే పాత బకాయిలను ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు పెరిగి పోవడానికి యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమని మోడీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. పెద్ద కంపెనీలు, వాణిజ్య సంస్థలు బకాయిలు చెల్లించలేకపోవడం పెద్ద అవరోధంగా మారింది. నాన్‌ ‌బ్యాంకింగ్‌ ‌ఫైనాన్సింగ్‌ ‌కంపెనీల విషయంలో గడిచిన మూడేళ్ళలో జరిగిన దానికి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. పెద్ద నోట్ల రద్దు వల్ల లిక్విడిటీ సమస్య ఏర్పడింది. మొండి బకాయిలు యూపీఏ ప్రభుత్వం హయాంలో పెరిగాయని తరచూ చెబుతున్న మోడీ ప్రభుత్వం తన హయాంలో పెరిగిన మొండి బకాయిల మాటేమిటి. అప్పటి కన్నా ఇప్పుడు ఎక్కువ బకాయిలు పడ్డాయి. పడుతున్నాయి. రిజర్వు బ్యాంకుపై ఒత్తిడి ఎక్కువైందనే విషయం బహిరంగంగా జనం చెప్పుకుంటున్నారు వాణిజ్య రంగానికి రుణాలు 90 శాతం తగ్గడానికి కారణం ఏమిటో ప్రభుత్వం ఆత్మశోధన చేసుకోవాలి. గిరాకీ సంక్షోభానికి పెద్ద నోట్ల రద్దు ప్రధాన కారణం. స్వదేశ డిమాండ్‌లో స్తబ్దత వల్ల భారత ఆర్థిక పరిస్థితి విలోమ స్థితిలో ఉందని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఇటీవల తెలిపారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో ఇలా ఎన్నడూ జరగలేదని ఆయన చెప్పారు. వరుసగా రెండేళ్ళ ఆర్థిక సర్వేలు డిమాండ్‌ను అంచనా వేయలేకపోయాయని ఆర్థిక వేత్తలు తెలిపారు. ప్రజల్లో వినిమయం బాగా తగ్గిపోయింది. 80 కోట్ల మంది ప్రజలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు. డిమాండ్‌ను సృష్టించాల్సిన సంస్థలు సాగిల పడుతున్నాయి. చమురు ధరలు సృష్టిస్తున్న ఉత్పాతాల సంగతి సరేసరి. ప్రధాని మోడీ ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలి. ఎంతసేపు పాత ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపడంతోనే తన పని అయినట్టుగా భావించరాదు. ఆర్థిక మందగమనాన్ని అరిక్టటేందుకు తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో జనానికి తెలియ జెప్పాలి. హౌసింగ్‌ ‌ఫైనాన్షియల్‌ ‌కార్పొరేషన్స్ ‌తమకు రావల్సిన బకాయిల గురించి ఇప్పటికీ వెల్లడించడం లేదని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. స్వదేశంలో డిమాండ్‌లో క్షీణత వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తన లోపాలను తెలుసుకోకుండా పూర్వపు పాలకులపై నెపాన్ని మోపి రోజులు నెట్టేద్దామంటే కుదరదు. వచ్చే బడ్జెట్‌ను సమర్పించే ముందైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆర్థిక రంగంలో సమస్యలపై తన బాధ్యత ఎంత వరకూ ఉందో తేల్చాలి. ఇవేమీ సరిచూసుకోకుండా ఐదేళ్ళలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామన్న ప్రకటనలు నీటి మీద రాతలవుతాయే తప్ప సాకారం కావు. బ్యాంకింగ్‌, ‌వాణిజ్య రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోడీ దృష్టిని కేంద్రీకరిస్తే తప్ప సమస్యలకు పరిష్కారాలు దొరకవు.
– ‘‌ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply