Take a fresh look at your lifestyle.

పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచే నిర్ణయాన్ని … ఉపసంహరించుకోవాలి

‌రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో తీసుకు వస్తున్న మార్పులు వెల్లడిస్తున్న విధానాలు వ్యవసాయ కుటుంబాలను మరింత సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా ఉన్నాయని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ రైతులతో,రైతు సంఘాలతో, వ్యవసాయ నిపుణులతో చర్చించకుండా కేవలం అధికారులతో, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో, తమ రాజకీయ పార్టీకి చెందిన రైతు బంధు కమిటీ సభ్యులతో మాట్లాడి ఈ విధానాలను అమలు పరచడం సరైన పద్దతి కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానా కాలం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించిన నియంత్రిత పంటల సాగు విధానంపై శనివారం రాష్ట్ర రైతు, ప్రజా సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రొ.కోదండరామ్‌తో పాటు జీవీ రామాంజనేయులు, కన్నెగంటి రవి, సారంపల్లి మల్లారెడ్డి, పి.శ్రీశైల్‌ ‌రెడ్డి, అచ్యుత రామారావు, సాగర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్‌ ‌మాట్లాడుతూ రాష్ట్రంలో వాస్తవ వ్యవసాయ సాగుదారులను గుర్తించాల్సిన అవసరం ఉందనీ, పత్తి, వరి పంటల సాగులో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారని చెప్పారు. ఈ కైలు రైతులకు రైతు బంధు, పంట రుణాలు, పంటల బీమా లాంటి ఏ మద్దతూ లభించడం లేదన్నారు. అలాగే, ఒంటరి మహిళా రైతులు, పోడు రైతుల వ్యవసాయానికి సబ్సిడీ పథకాలలో తగిన వాటాను మహిళా రైతులకు తప్పకుండా అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాగుభూములలో నూనె గింజలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్య పంటలు బాగా పండుతాయనీ, ఈ పంటల సాగును బాగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి.

Leave a Reply