మండలంలోని నారయణ పూర్ గ్రామానికి చెందిన పెద్దోల్ల అజిత్‌పాల్(4) సిరిసిల్లాలోని సూర్య ఆసుపత్రిలో 5రోజుల నుండి చికిత్స పొందుతూ వైద్యం వికటించి సోమవా రం మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల వివరాల మేరకు అజిత్‌పాల్ జ్వరంతో తళ్లడిల్లుతుండగా ఈ నెల 13న సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని సూర్య పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. 5రోజుల నుండి జ్వరం తగ్గకపోగా సరైన వైద్యం అందించక పోవ డంతో చిన్నారి తళ్లడిల్లాడని అన్నారు. వైద్యం జరిగా అందించకపోవడంతో వైద్యం వికటించడం వల్లనే చిన్నారి మృతి చెందాడని తల్లితండ్రులు పెద్దోల రాజనర్సు, భాగ్యలతో కలిపి ఆసుపత్రి ముందు ధర్నాకు సిద్ధంకాగా పోలీసులు ఆందోళన చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారుజ. వైద్యం వికటించడం వల్లనే చిన్నారి మృతి చెందాడని ఆసుపత్రిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు అన్నారు. కుటుంబ సభ్యుల రోధనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి.