Take a fresh look at your lifestyle.

ఎం‌సెట్‌ ‌తదితర టెస్టుల దరఖాస్తులకు గడువు.. జూన్‌ 10

పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఉన్నత విద్యామండలి
తెలంగాణలో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, ‌పీజీఈసెట్‌, ‌పీఈసెట్‌, ‌లాసెట్‌, ‌పీజీఎల్‌ ‌సెట్‌ ‌ప్రవేశ పరీక్షలకు జూన్‌ 10 ‌వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌ ‌సెట్‌, ‌పీజీఈసెట్‌, ‌పీఈసెట్‌, ‌లాసెట్‌, ‌పీజీఎల్‌ ‌సెట్‌ ‌తదితర ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply