Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

చట్టాలను దుర్వినియోగం చేస్తున్న నేతలు
మాజీమంత్రి ఈటల రాజేందర్‌
టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..ఆ పార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంలాగా వాడుకుంటున్నారని మాజీమంత్రి, బిజెపినేత ఈటల రాజేందర్‌ ‌విమర్శలు సంధించారు. అటువంటి నీచ సంస్కృతి టీఆర్‌ఎస్‌ ‌నేతలకే ఉందని..పార్టీ నుంచి బయటకు వొచ్చినప్పటి నుంచి తనపై మాటలతో దాడులు చేస్తున్నారని..అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను వారి చిల్లర దాడులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌నుంచి బయటకొచ్చాక ఈటల రాజేందర్‌ ఏమాత్రం తగ్గట్లేదు. ఇదే క్రమంలో మరోసారి ఈటల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌవరం కలిగినవారనీ..వారి ఆత్మగౌరవాన్ని వారు ఎప్పుడు పోగొట్టుకోరని..వి•లా దిగజారుడు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు తెలిదన్నారు.

సహజ న్యాయసూత్రాలను పాటించే పార్టీ బీజేపీ ఒక్కటేనని..టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా పార్టీని వీడినప్పటినుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌పై టీఆర్‌ఎస్‌ అ‌గ్రనేతలు సైతం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈటల విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ కౌంటరిస్తున్నారు. ఇలా ఈటల-టీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య కౌంటర్‌ ఎన్‌ ‌కౌంటర్‌లు కొనసాగుతున్నాయి.

ఈటల రాజేందర్‌ ‌రేపటి నుండి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనుండడంతో పాటు బీజేపీ రాష్ట్ర నేతలు మొత్తం హుజూరాబాద్‌ ‌పై దృష్టి సారించారు. ఈటలను గెలిపించుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి నేతలను కూడా హుజూరాబాద్‌కు రప్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇలా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌మధ్య కాకరేపుతుంది.

Leave a Reply