Take a fresh look at your lifestyle.

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

The crowds of devotees in the Rajna Sanni
శ్రీ‌స్వామివారి దర్శనం కోసం వేచిఉన్న భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో రద్దీ అధికంగా ఉంటుందని భావించిన భక్తులు సోమవారం అధిక సంఖ్యలో శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు 30 వేలకు పైగా భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకో వడంతో ఆలయ ప్రాంగణం,మేన్‌ ‌రోడ్డు కిక్కిరిసిపోయింది. వేలాది భక్తులు వేకువ జామునుండే ధర్మగుండంలో స్నానాలాచరించి, కోడె మొక్కులు చెల్లించుకోవడానికి,శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరడాన్ని గమనించి,మహామండపంలో లఘు దర్శనం ఏర్పాటు చేసి,శ్రీస్వామివా రిని దర్శించుకున్న భక్తులను త్వరితగతిన బయటకు పంపించారు.గత సోమవారం మాదిరిగానే ఆలయ దక్షిణ ద్వారాన్ని తెరిచి భక్తులను బయటకు పంపించారు. ఈ సందర్భంగా దేవస్థానానికి రూ 12 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని సిబ్బంది వెల్లడించారు.

భక్తులను కుమ్మిన కోడెలు
ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకోవడానికి కోడెలను పట్టుకుని భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా కోడెల మధ్య కొట్లాట మొదలైంది.ఈ క్రమంలో కోడెల కొట్లాడుతుండగా అక్కడే ఉన్న ఇద్దరు భక్తులు గాయపడ్డారు.వెంటనే ఆలయ సిబ్బంది,భక్తులు కోడెలను అదుపు చేసి,గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి పంపించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply