Take a fresh look at your lifestyle.

తెలంగాణను విముక్తి చేసిన ఘనత కాంగ్రెస్‌దే

  • ముమ్మాటికి తెలంగాణకు స్వాతంత్య్ర దినోత్సవమే
  • కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అధికారిక కార్యక్రమం
  • బిజెపికి నేతలు లేకపోవడంతో కాంగ్రెస్‌ ‌నేతల పేర్లు వాడుకుంటుంది
  • గాంధీభవన్‌ ‌జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పిసిసి చీఫ్‌  ‌రేవంత్‌

తెలంగాణకు స్వాతంత్య్రం వొచ్చిన రోజు సెప్టెంబర్‌ 17 అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చాక సెప్టెంబర్‌ 17‌ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మతవిద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17‌పై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చర్చ పెట్టాలని, అందుకు కాంగ్రెస్‌ ‌సహకరిస్తుందన్నారు.

1937 నుంచి 1947 వరకు రజాకార్లు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నవాబు తెలంగాణను స్వాతంత్య్ర భారతదేశంలో విలీనం చేశారన్నారని రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు. ఆనాటి ప్రధాని నెహ్రూ కృషి వల్లనే తెలంగాణ విముక్తం అయ్యిందన్నారు. అందుకు నాటి హోమ్‌ ‌మంత్రి పటేల్‌ ‌కూడా కృషి చేశారని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టమని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17 అం‌టే తెలంగాణకు స్వాతంత్రం వొచ్చిన రోజని..ఆ స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని ఆయన అన్నారు. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు స్వాతంత్య్రం వొచ్చినపుడు నిజాం పాలకులు తెలంగాణను ఇండియాలో విలీనం చేయకుండా పాకిస్తాన్‌లో విలినం చేయాలని చూశారు. అప్పుడు ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ఆదేశాలతో సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ఆపరేషన్‌ ‌పోలో జరిపి తెలంగాణను భారత్‌లో విలీనం చేశారు.

అందుకే తెలంగాణకు సెప్టెంబర్‌ 17 ‌స్వాతంత్రం వొచ్చిన రోజన్నారు. ‘ఇప్పుడు కొంతమంది కొత్త బిచ్చగాళ్ల వొచ్చారు. వారికి ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. జవాహర లాల్‌ ‌నెహ్రు నిర్ణయం వల్లనే తెలంగాణ విలీనం జరిగింది. ప్రధాన మంత్రి నిర్ణయాన్ని హోమ్‌ ‌శాఖ మంత్రి అమలు చేస్తారు. దాంతో బీజేపీ వాళ్ళు తెలంగాణ విలీనం హోమ్‌ ‌శాఖ మంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌వల్లే జరిగిందని చెప్తున్నారు. సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌కూడా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పని చేశారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఒక్క నాయకులు కూడా లేరు. అందుకే కాంగ్రెస్‌ ‌నేతల పేర్లు వాడుకుంటున్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్‌, ‌రాంజీ గోండు, చాకలి అయిలమ్మ, కొమురం భీంల పోరాట స్ఫూర్తితో పని చేస్తాం.

ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17‌ను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతాం’ అని రేవంత్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

Leave a Reply