Take a fresh look at your lifestyle.

‌కోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం

భద్రాచలం పట్టణంలో భద్రాచలం ఆదివాసి సమితి (బిఏఎస్‌) అధ్వర్యంలో సోమవారం నాడు జిఓ నెం. 3 ని సుప్రీం కోర్ట్ ‌కొట్టేసినందున,సుప్రీం కోర్టు తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం అధ్యక్షుడు పూనెం కృష్ణ దొర మాట్లాడుతూ ఈ తీర్పు ఆదివాసీలకి గొడ్డలిపెట్టు వంటిదని,ఆదివాసీలపై కోర్టు తీర్పు కక్ష్య పూరితంగా ఉందని, ఈ తీర్పుపై పునఃపరిశీలన జరగాలని, లేకపోతె ఆదివాసిలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే రివ్యూ పిటిషన్‌ ‌సుప్రీంకోర్టులో వేయాలని కోరారు. ఆదివాసి సీనియర్‌ ‌నాయకుడు సోందె వీరయ్య మాట్లాడుతూ రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ ‌ప్రకారం ఈ ఆదివాసీ• ప్రాంతాలలో అన్ని రంగాల్లో పూర్తి అధికారాలు ఆదివాసిలకే ఉన్నాయని,దీని ఆధారంగానే గవర్నర్‌ ‌కి ఉన్న లెజిస్లేటివ్‌ ‌పవర్స్ ‌తో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసిలకే చెందాలని జిఓ నెం. 3 తీసుకొచ్చారని,దీన్ని గౌరవ సుప్రీం కోర్టు అర్దం చేసుకోలేక పోయిందని అన్నారు.

అదే విధంగా ఆదివాసి ఎమ్మెల్యేలు టిఏసి లో 100 శాతం రిజర్వేషన్లు కొరకు తీర్మాణం చేయాలని, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ ‌వేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పాయం రవివర్మ ,ముఖ్య సలహాదారులు పూనెం వీరభద్రం, కల్లూరి జయబాబు, మడివి నెహ్రూ,ఉపాధ్యక్షుడు కొర్సా చిట్టిబాబు దొర, మహిళా కార్యదర్శి కోండ్రు సుధారాణి, కార్యవర్గసభ్యులు కొమరం నాగయ్య,వర్స వసంత రావు, సోయం హనుమంతరావు, సభ్యులు ముర్ల దుర్గా రెడ్డి, గుండి చలపతిరావు,సోందే రవికుమార్‌, ఇర్ప కృష్ణ,కుంజా రాఘవులు,అట్టం రామలక్ష్మి,అట్టం కమల గార్లు మరియు ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply