Take a fresh look at your lifestyle.

దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

కొరోనా ముప్పును ప్రధాని లైట్‌గా తీసుకుంటున్నారు  ః రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌
‌భారత ప్రధాని నరేంద్ర మోదీపై జాతీయ కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థే మన దేశానిక బలంగా ఉండేదని..ఇప్పుడు దాన్ని బలహీనంగా మర్చేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలు మోదీ విధానాల వల్ల మన ఆర్థికవ్యవస్థ దిగజారిందని మండిపడ్డారు. కొరోనా భారత్‌కు ముప్పుగా మారుతున్నా..మోదీ లైట్‌గా తీసుకుంటున్నారని రాహుల్‌ ‌ప్రతిరోజూ ఎదో ఒక విధంగా విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా  మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తాజాగా  ఆయన ఓ ట్వీట్‌ ‌చేశారు. మోదీ ప్రయోజిత విధ్వంసాలతో దేశం సతమతమవుతున్నదని రాహుల్‌ ‌తన ట్వీట్‌లో ఆరోపించారు.  మోదీ పాలన వల్ల దేశంలో జీడీపీ చరిత్రాత్మక స్థాయి(23)కి దిగజారిపోయింది అన్నారు.  45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయికి నిరుద్యోగం పెరిగిందని రాహుల్‌ ‌విమర్శించారు. సుమారు 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రాలకు జీఎస్టీ కింద వచ్చే వాటాను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భారత్‌లో కొరోనా వైరస్‌ ‌కేసులు మరణాలు సంభవించినట్లు విమర్శించారు. మన సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆక్రమణలు ఎక్కువ అయినట్లు రాహుల్‌ ‌తన ట్వీట్‌లో మోదీపై ఆరోపణలు చేశారు.

Leave a Reply