Take a fresh look at your lifestyle.

దేశం మారుతోంది

వేయిల కోట్ల విగ్రహాలు
మసీదు మందిరాలు నిర్మించి
ప్రజలకు ఆక్సిజన్‌ ‌ను అందివ్వలేని
డిజిటల్‌ ఇం‌డియా..

హాస్పిటల్స్ ‌ను
ఆధునిక మార్చురీలుగా మార్చిన
మేకిన్‌ ఇం‌డియా..

దేశ ప్రజల్ని
స్మశానలకు ఊడ్చేసిన
స్వచ్ఛ్ ‌భారత్‌..

‌బతికున్న దేశభక్తుల సాక్షిగా
ఇప్పుడు
జవానుల అమరత్వాలను
దేశమంతా ఉరేగించండి

ఓట్లకోసం••
గుట్టల శవాలను
గుట్టుగా కాల్చేయండి..

శవాలపై ఓట్లెరుకునే
నాయకుల సాక్షిగా
భారత్‌ ‌మాతకి జై.
దర్పల్లి సాయికుమార్‌

Leave a Reply