Take a fresh look at your lifestyle.

దేశం పరువు తీశారు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ పొన్నాల

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు పొన్నాల లక్ష్మయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రపదజాలంతో విమర్శించారు. దేశంలో మత ప్రాతిపదికన ప్రజలను, దేశాన్ని విడదీసి బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశానికి, అమెరికా దేశాధినేత వచ్చిన సమయంలో దేశ రాజధానిలో మత ఘర్షణలు జరగడంతో అంతర్జాతీయంగా దేశం పరువు పోయిందని పొన్నాల అన్నారు. ఇంత పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగి 47 మంది చనిపోయి, వేలాది మంది గాయలపాలు అయితే ఈ విషయంపై ఎందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు కనీసం పార్లమెంట్‌లో కూడా ఎందుకు చర్చించలేదు అని కేంద్రాన్ని ప్రశ్నిచారు. దేశంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మత పరమైన అంశాలకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తోంది. అది 370 ఆర్టికల్‌ ‌రద్దు కావొచ్చు, రామాలయ మందిర నిర్మాణం కావొచ్చు, ముస్లిం పర్సనల్‌ ‌లా కు సంబంచించిన ట్రిపుల్‌ ‌తలాక్‌ అం‌శం కావొచ్చు, సీఏఏ కావొచ్చు, ఏన్‌ ఆర్‌ ‌పి కావొచ్చు.. ఏ అంశంలో బీజేపీకి మతపరమైన రాజకీయ లబ్ది జరుగుతోందో దానికే ప్రాధాన్యత బీజేపీ ఇస్తోందన్నారు. 70 ఏళ్ళు నుంచి ఈ దేశంలో ఉన్న వారు, ఈ దేశమే తమ ఇల్లు అనుకునే వారు.

పరమత సహనంతో,మనుషులంతా ఒక్కటే అనుకునేవారు, మత సామరస్యానికి, ప్రపంచానికి ఆదర్శగా ఉండే మన దేశ ప్రజలు వారి ఉనికిని చెప్పుకునే దౌర్భాగ్యం రావడం ఏమిటని ప్రశించారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఏర్పడింది.. ఉద్యోగాలు దొరకడం లేదు. నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పరిశ్రమలు లక్షలాదిగా మూత పడుతున్నాయి. అనేక సంస్థలు దివాళా తీస్తున్నాయి..ఉద్యోగాలు రాక యువత నిరుత్సాహంతో ఉన్నారు. నల్లధనాన్ని తెచ్చి దేశాన్ని ఆర్థికంగా అభివృద్దే చేస్తా అన్న మోడీ నోట్ల రద్దుతో ఏమేరకు నల్లధనం వెనక్కి వచ్చింది అన్న విషయంపై నోరు ఎత్తడం లేదు. ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం రాజనీతి అవుతుందా? అని బీజేపీని తూర్పారబట్టారు.

Leave a Reply