Take a fresh look at your lifestyle.

రెండేళ్ల వరకు కొరోనా వ్యాక్సిన్‌ ‌వొచ్చే అవకాశం లేదు

  • వొచ్చే ఏడాదికి స్పష్టత రావొచ్చు.. బూస్టర్‌ను సిద్ధం చేశాం
  • వైరస్‌ ‌తగ్గిపోయిందనుకుంటే పొరపాటే : సిసిఎంబి డైరెక్టర్‌ ‌రాకేష్‌ ‌మిశ్రా

మరోరెండేళ్ల వరకు కొరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ‌వచ్చే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్‌ ‌రాకేష్‌ ‌మిశ్రా అన్నారు. భారతదేశంలో వైరస్‌ ‌తగ్గిపోయిందనుకుంటే పొరపాటేనని చెప్పారు. వైరస్‌ను అపోహలతో  కొందరు తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు అపోహలు వీడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచించారు. భారత్‌ ‌బయోటెక్‌, అరబిందో ఫార్మసీ సహా వివిధ కంపెనీలతో కలసి వ్యాక్సిన్‌ ‌కోసం పరిశోధనలు జరుపుతున్నామని తెలిపారు. వొచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్‌పై స్పష్టత రావొచ్చన్నారు. మూడు నెలలుగా వ్యాక్సిన్‌ ‌కోసం పరిశోధనలు జరుపు తున్నామని ఆయన పేర్కొన్నారు.

కోట్ల మందికి వ్యాక్సిన్‌ ‌తీసుకురావటం చాలా కష్టమైన వ్యవహరమని చెప్పారు. పరిశోధనలకు తోడు అదృష్టం కూడా కలసిరావాలని చెప్పారు. హైదరాబాద్‌ ‌హాస్పిటళ్లలో కొరోనా బాధితులు తగ్గటం సంతోషకరమన్నారు. హాస్పిటళ్లను పరిశీలించి కొరోనా వైరస్‌పై అంచనాకు రాకూడదని ఆయన సూచించారు. పుట్టగొడుల్లో ఉండే పదార్థంతో కలసి ఇమ్యూనిటీ బూస్టర్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. కొరోనా వైరస్‌ ‌నుంచి రక్షించుకోవటానికి కమ్యూనిటీ బూస్టర్‌ ‌రోగనిరోధక శక్తిని పెంచుతోందన్నారు. ఆహారంతో కలిపి ఇమ్యూనిటీ బూస్టర్‌ను తీసుకోవాలని రాకేష్‌ ‌మిశ్రా సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply