- వలస కార్మికుల కరోనా కష్టాలు
- లాక్ డౌన్ నేపథ్యంలో కాలినడకన సొంత గ్రామాలకు
కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అన్ని స్తంభించాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలు ఇండ్ల నుంచి బయటి రాకుండా కరోనా నివారణ చర్యల్లో భాగంగా మద్దతు కొనసాగుతున్న విషయం తెల్సిందే. అయితే వచ్చిన చిక్కల్లా పొట్టకూటి కోసం వలస వెళ్లినా కార్మికులదే . ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరియు ఇతర రాష్టలకు చెందిన ప్రజలు ఉపాధి కొరకు హైదరాబాద్ లో దొరికిన పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఆదేశాలతో ఎక్కడ ఉపాధి లేక సొంత గ్రామాలకు వెళ్ళడానికి ప్రజా రవాణా వ్యవస్థ లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

చేసేది లేక ఇండ్లకు కాలినడకన యాత్ర చేపట్టారు. ఆకలికి అలమటిస్తు, ఎర్రటి ఎండలో నడకయాత్రలో కాళ్ళకు గాయాలు, కళ్ళు మండుతున్నా సూది మందుకు డబ్బులు లేక ఆకు పసరులనే గాయాలకు మందు వేసుకుంటూ షాద్ నగర్ బెంగుళూర్ తిమ్మాపూర్ రహదారి పరిధిలో నిస్సహాయ స్థితిలో సేద తమ స్వంత గ్రామాలకు కాలి నడకన కడుపు కాల్చుకుంటు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అక్కడక్కడ మానవత్వంతో ఇచ్చే బిస్కెట్లు పండ్లు నీళ్లు తాగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూన్నారు.
