- లాక్డౌన్ రావొద్దంటే మాస్కులు ధరించాల్సిందే..
- నగరంలో పలు అభివృద్ధి పనులకు కెటిఆర్ శ్రీకారం
- అందుబాటులోకి కూకట్పల్లి ఆర్యూబి
కొరోనా పూర్తిగా పోలేదని, మరోసారి లాక్డౌన్ రావొద్దంటే అందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కొరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు. వైరస్ కట్టడికి హాస్పిటళ్లలో వైద్యులు సిద్ధంగా ఉండి పనిచేస్తున్నారని అన్నారు. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కెటిఆర్ సోమవారం శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి ఆర్యూబీని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీంతో ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయాయి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ ఆర్యూబీని నిర్మించారు. రూ.66.59 కోట్ల వ్యయంతో 410 వి•టర్ల పొడవు, 20.60 వి•టర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆర్యూబీ అందుబాటులోకి రావడంతో కూకట్పల్లి-హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పాయి. ఈ ఆర్యూబీ నిర్మాణానికి ముందు శేరిలింగంపల్లి నుంచి వొచ్చే వరదనీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. భారీ వర్షాలు పడితే ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవి. వరదనీటిని అక్కడే నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. అందులోని నీటిని మూసాపేట సర్కిల్లో హరితహారం మొక్కలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక మూసాపేట్ సర్కిల్ లోని అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు రూ. 99 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విలీనమైన నగర శివారు మున్సిపాలిటీల్లో రూ. 3,500 కోట్ల వ్యయంతో సమగ్ర డ్రైనేజీ పునర్ నిర్మాణ పనులు చేపడుతామన్నారు. గతంలో రూ. 3,000 కోట్లతో తాగు నీరందించే పనులు విజయవంతంగా చేపట్టాము అని తెలిపారు. కైతలపూర్‌లో డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నందున, ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధునీకరణ ట్రాన్స్ఫర్ పాయింట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శివారు ప్రాంతాలకు తాగునీటిని ఇస్తున్నాము. డ్రైనేజీ సిస్టమ్‌ను కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని, దీంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కైతలాపూర్ విలీనమైన నగర శివారు మున్సిపాలిటీల్లో రూ.3,500 కోట్ల వ్యయంతో సమగ్ర డ్రైనేజి పునర్ఃనిర్మాణ పనులు చెప్పడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కైతలపూర్‌లో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని, ఇక్కడి ప్రజలకు ఇబ్బంది లేకండా ఆధునీకరణ ట్రాన్స్ఫర్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాకాలంలో ఇళ్లల్లోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శివారు ప్రాంతాలకు నీటిని ఇస్తున్నామని, డ్రైనేజి సిస్టమ్‌ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని, మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.