సూర్యాపేట, జూన్ 12, ప్రజాత ంత్ర ప్రతినిధి):రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తండ్రి శానం పూడి అంకిరెడ్డిల స్మారకర్థం నిర్మించ తలపెట్టిన రైతువేదికను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యా యానికి శ్రీకారం చుట్టినట్ల యిందని, ప్రతి అయిదు వేల మం దికి ఒక వ్యవసాయ శాఖ అధికా రిని నియమించి రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేయనుందన్నారు. రైతును ఆర్థికం గా పరిపుష్టం చేయ్యడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. వారి వెంట ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, అదనపు కలెక్టర్ డి. సంజీవరెడ్డి, ఏడిఎ జ్యోతిర్మయి, జగన్ నాయక్, కొండా పార్వతి, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తా : మంత్రి
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో విస్రృతంగా పర్యటించి, పలు అభివృద్ది పనులను మంత్రి జగ దీష్‌రెడ్డి ప్రారంభించారు. ముం దుగా కోదాడ నియోజక వర్గం లోని మునగాల మండల కేంద్రం లో నిర్మిస్తున్న 72డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి పూజలు చేశారు. అనంతరం కోదాడకు చేరుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయాన్ని, ఎంపిడిఓ కార్యాల యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు లాక్‌డౌన్ కారణంగా వ్యవస్థలు అన్ని స్తంభించిపో యాయి, లాక్‌డౌన్ సడలింపుతో తెలంగా ణలో అభివృద్ది పనులు యధా విదిగా కొనసాగుతున్నా యని పే ర్కొన్నారు. కార్యక్రమం లో ఎంపి లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే మల్లయ్య, సైదిరెడ్డిలు ఉన్నారు.