Take a fresh look at your lifestyle.

నాపై దాడికి కుట్ర నిజమే: ఈటల రాజేందర్‌

  • రక్షణ కుదించడం న్యాయమా
  • దళిత బంధు పథకం అందరికీ వర్తింప చేయాలి
  • రెండోరోజు పాదయత్రలో ఈటల రాజేందర్‌

తన రక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని హుజురాబాద్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. నియోజకవర్గంలో చేపట్టిన ‘ప్రజా దీవెన యాత్ర’ రెండో రోజు కమలాపూర్‌ ‌మండలం అంబాల గ్రామం నుంచి ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాల మధ్య పాదయాత్ర సాగుతుంది. అంబాల నుంచి గూడూరు, నేరెళ్ళ, లక్ష్మీపూర్‌, ‌కాశింపల్లి, పగిడిపల్లి, వంగపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది. రెండో రోజు పాదయాత్ర సందర్భంగా ఈటల వి•డియాతో మాట్లాడుతూ..‘హన్మకొండ కేంద్రంగా నాపై దాడికి కుట్ర జరుగుతుందని సమాచారం ఉంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది. మంత్రుల ఫోన్స్ ‌ట్యాప్‌ ‌చేసే ప్రభుత్వానికి.. నాపై జరుగుతున్న కుట్ర గురించి తెలియదా? మాజీ ఎమ్మెల్యేలకు టు ప్లస్‌ ‌టు గన్‌మెన్లను ఇచ్చే సర్కార్‌.. ‌కక్ష సాధింపుతో నాకు మాత్రం వన్‌ ‌ప్లస్‌ ‌వన్‌ ‌గన్‌మెన్‌లను మాత్రమే సెక్యూరిటిగా ఇచ్చింది. ఇంటెలిజెన్స్ ‌చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు చట్టానికి లోబడి కాకుండా..చుట్టానికి లోబడి పని చేస్తున్నాడు. ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌కూడా కేసీఆర్‌ ‌బాధితులే. మేం పొలిటికల్‌ ‌బాధితులమైతే.. వాళ్లు అఫిషియల్‌ ‌సైడ్‌ ‌నుంచి బాధితులు’ అని ఈటల అన్నారు.

తనపై ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి పాదయాత్రను అడ్డుకుని, దాడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‌సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌ అయిన ఈ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమాలకర్‌ ‌స్పందిస్తూ.. సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించుకోవచ్చని.. తాను సిద్ధంగానే ఉన్నానని ఒకింత సవాలే విసిరారు. గంగుల మాట్లాడిన మాటలపై మరోసారి ఈటల రాజేందర్‌ ‌స్పందిస్తూ.. ‘ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి నాహత్యకు కుట్ర చేస్తున్నారనేది ఆరోపణకు కట్టబడి ఉన్నాను..త్వరలోనే ఫోటోలతో ఆధారాలు విడుదల చేస్తాను’ అని స్పష్టం చేశారు. ఓడిపోతామన్న అసహనంతో ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతున్నారు. దళితులకు మూడెకరాల హావి• ఏమైంది..?. దళితులకు సబ్‌ప్లాన్‌ ‌నిధులు అందించలేదు. ఇప్పుడు హుజూరాబాద్‌ ఎన్నికలు టార్గెగా మళ్లీ హావి•లు ఇస్తున్నారు. ప్రభుత్వం, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ ప్రజలు నావెంటే ఉన్నారు.

డబ్బులు పెట్టే శక్తి నాకు లేదు అందుకే ప్రజలను జాగృతం చేస్తున్నాను. నా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఏ ప్రయోగాలు చేసినా హుజూరాబాద్‌ ‌ప్రజలు నావెంటే ఉంటారు. హుజూరాబాద్‌ ఎన్నికల సందర్భంగానైనా ఉద్యోగాల నియామకాలు జరగాలి. వోటు పదివేల రూపాయలు ఇస్తారట.. తీసుకోండి కమలం గుర్తుకు వోటు వేయండని పిలుపునిచ్చారు. డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు సొంతంగా నిర్మించుకునే అవకాశం కల్పించాలని ఈటల చెప్పుకొచ్చారు. హుజూరాబాద్‌లో దళిత బిడ్డలకు రూ.10లక్షల చొప్పున ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఈటల రాజేందర్‌ అన్నారు. యాత్రలో భాగంగా గూడూరు గ్రామశివారులో వరి పొలాల్లో నాటు వేస్తున్న కూలీలతో మాట్లాడిన ఈటల వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికల పుణ్యమా దళిత కుటుంబాల్లో మంచి ఆర్థిక పరిపక్వత కలుగాలని ఆశిస్తున్నాను. ఇది కేవలం హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద దళిత కుటుంబాలన్నింటికీ వర్తింపజేయాలని డిమండ్‌ ‌చేశారు.

Leave a Reply