Take a fresh look at your lifestyle.

కర్నూలులో కదం తొక్కిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు

పెట్రో ధరలకు నిరసనగా భారీ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు సాకె శైలజానాథ్‌
‌కర్నూలు, జూలై 17 : పెట్రోల్‌ ‌ధరలను నిరసిస్తూ కర్నూలు లో కాంగ్రెస్‌ ‌భారీ ర్యాలీ నిర్వహించింది. వేలాదిగా ప్రజల మద్దతుతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో •రెత్తించింది. డీజల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌, ‌నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో ఏఐసీసీ ,పీసీసీ పిలుపు శనివారం కర్నూలులో స్థానిక కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయం నుండి జిల్లాపరిషత్‌ ‌గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యమానికి కర్నూలు,నంద్యాల పార్లమెంట్‌ ‌జిల్లాల అధ్యక్షులు అహ్మద్‌ అలీ ఖాన్‌ ‌గారు , జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిదులుగా ఆంధ్రప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సాకే శైలజ నాథ్‌ , ఏఐసీసీ సెక్రటరీ కృష్టఫర్‌ ‌రు, మయప్పన్‌ , ఏపీపీసీసి రాష్ట్ర వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఎన్‌.‌తులసి రెడ్డి , మస్తాన్‌ ‌వలి, వివిధ జిల్లాల నుండి కాంగ్రేస్‌ ‌పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ ‌పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు .

కర్నూలు కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయం నుండి జిల్లా పరిషత్‌ ‌గాంధీ విగ్రహం వరకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ర్యాలీ కొనసాగింది అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాల వేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పీఎం, సీఎం ఇద్దరు కలిసి ప్రజల పై విపరీతంగా పన్నులు పెంచుతూ పెట్రోలు డీజల్‌ ‌ధరలను సెంచరీ దాటించయని తెలిపారు ప్రధాని మోడీ విధానాలతో దేశం ప్రమాదంలో పడిందని, కేంద్రనీ లో మోడీ విధానాలకు రాష్ట్రం లో సిఎం వై ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజలను మరింత పన్నుల ఊబి లోకి తోసేసారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో కేంద్ర ఎక్సైజ్‌ ‌సుంకం పెట్రోల్‌ ‌పై లీటర్‌ ‌కు 9.48, డీజల్‌ ‌పై లీటర్‌ ‌కు 3.56 పైసలు మాత్రమే వసూలు చేసేదని, అయితే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం లీటర్‌ ‌పెట్రోల్‌ ‌పై 33, లీటర్‌ ‌డీజల్‌ ‌పై 31.80 పైసలు కేంద్ర ఎక్సైజ్‌ ‌సుంకం వసూలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచి పెట్రోల్‌ ‌డీజల్‌ ‌ధరలను సెంచరీ దాటించారని ఎద్దేవా చేశారు, సబకా వికాస్‌ అం‌టే దేశం ఏడూ నెలల్లో ఏడూ సార్లు వంట గ్యాస్‌ ‌ధరలు పెంచి మహిళల కంట కన్నీళ్లు తెప్పించటమే అని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నుండి కోవిడ్‌ 19 ‌వరకు ప్రతీది మోడీ విఫలం అయ్యారని విమర్శించారు.

అచ్చెదిన్‌ అని మంచిరోజులు వస్తాయని మతం పేరుతోనే బిజెపి రాజకీయాలు చేస్తుందని ఆవేదనవ్యక్తం చేశారు. వంట నూనె ధరలను ఏకంగా డబుల్‌ ‌సెంచరీ దాటించారని ఆవేదన వ్యక్తం చేశారు, దేశం లో మొదటి సరిగా చెత్తపన్ను వాసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం జగన్‌ ‌ప్రభుత్వమే అని తెలిపారు, ఈ కరోన కష్ట కాలంలో ఈ పన్నుల భారం ఏంటని ప్రశ్నించారు, జగన్‌ ‌విడుదల చేసిన జాబ్‌ ‌లెస్‌ ‌క్యాలెండర్‌ ‌ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు . త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇంటింటి కార్యక్రమం తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మరియు నంద్యాల పార్లమెంట్‌ ‌జిల్లాల కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply