Take a fresh look at your lifestyle.

అం‌తర్గత స్వేచ్ఛనే కాంగ్రెస్‌ ‌పార్టీ కొంపముంచుతున్నది

ఓటమికి బాధ్యత వహిస్తూ హరీష్‌ ‌రావు రాజీనామా చేయాలి..

దుబ్బాక ఉపఎన్నికల ఓటమికి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌ ‌చాట్‌ ‌చేస్తూ….దుబ్బాక ఉపఎన్నికల్లో అభ్యర్థిని చివరిలో ప్రకటించడంతో ఇబ్బంది పడ్డామని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత స్వేచ్ఛనే  పార్టీని దెబ్బతీస్తుందన్నారు. ఇన్‌ ‌ఛార్జ్ ‌మణికం టాగూర్‌ ‌దీన్ని సెట్‌ ‌చేయాలని సూచించారు.
ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసి వీక్‌ ‌చేసే ప్రయత్నం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ  వీక్‌ ‌కాలేదన్నారు. కాంగ్రెస్‌ ఓటమికి పీసీసీ రాజీనామా చేయాలని పదే పదే కొందరు ఉత్తమ్‌ను పర్సనల్‌గా టార్గెట్‌ ‌చేస్తున్నారని, ఉత్తమ్‌ ‌దిగిపోవాలి అంటుంన్న వారు అసలు పార్టీకి సంబంధించిన వారు కాదని, ఫేస్‌ ‌బుక్‌ ‌వీరులు ఆచి తూచి పోస్ట్‌లు పెట్టండని హెచ్చరించారు. ఉత్తమ్‌ను పర్సనల్‌గా డ్యామేజ్‌ ‌చేసేందుకు కొందరు పనిగట్టుకొని సోషల్‌ ‌మీడియాలో ఉత్తమ్‌ ‌వ్యతిరేక పోస్ట్‌లు పెడుతున్నారని సీఎం కూతురు ఓడినా, దుబ్బాకలో ఓడినా కేసీఆర్‌ ‌ఫెయిల్‌ అని ఎందుకు  పెట్టట్లేదన్నారు. మాజీ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి  గతంలో ఓడిపోలేదా..ఆయన అసమర్థుడా.. ! లక్ష్మణ్‌ అధ్యక్షుడిగా ఉండి  ఓడిపోయాడు.. ఇంతటితో బీజేపీ అసమర్థపు పార్టీ అవంతుందా అని ప్రశ్నించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply