Take a fresh look at your lifestyle.

ఎన్‌ఎస్‌యూఐ పోరాటాన్ని కాంగ్రెస్‌ ‌కొనసాగిస్తోంది

  • విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాల చెలగాటం
  • ఎంట్రెన్స్ ‌పరీక్షలు వాయిదా వేయాలి : పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌
  • ‌క్షీణించిన వెంకట్‌ ఆరోగ్యం.. హాస్పిటల్‌కు తరలింపు

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ ‌రావు చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ కొనసాగిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. వెంకట్‌ ఆరోగ్యం చాలా క్షీణించిన పరిస్థితులలో హాస్పిటల్‌కు పంపుతున్నామని అన్నారు. వెంకట్‌ ‌మూడు రోజుల నుండి గాంధీభవన్‌లో విద్యార్థుల పక్షాన ఆమరణ దీక్ష చేస్తున్నారు. వెంకట్‌ ‌చేస్తున్న దీక్ష శిబిరాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ విహెచ్‌, ‌విక్రమ్‌ ‌గౌడ్‌లు సందర్శించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ….వెంకట్‌ ‌తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారని, బీపీ చాలా పడిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లోనే కిమ్స్ ‌హాస్పిటల్‌కు వెంకట్‌ ‌ను తరలిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కొరోనా విజృంభిస్తున్న తరుణంలో వెంకట్‌ ‌విద్యార్థుల శ్రేయసు కోసం దీక్ష చేపట్టారు ఆయన పక్షాన పోరాటం కొనసాగిస్తామని దేశవ్యాప్తంగా జేఈఈ, నీట్‌ ‌పరీక్షలు వాయిదా వేయాలని, అలాగే రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం అడుతున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల శ్రేయస్సును కాంక్షించి పరీక్షలు వాయిదా వేయాలన్నారు. వెంకట్‌ని హాస్పిటల్‌కి తరలించిన తర్వాత ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు చలో రాజభవన్‌ ‌ముట్టడికి ప్రయత్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకోగా గాంధీభవన్‌లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పర్మిషన్‌ ‌లేదని పోలీసులు చెప్పడంతో అక్కడే ఉన్న నాయకులు కలుగచేసుకొని సద్దుమణిగేలా చేసారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!