Take a fresh look at your lifestyle.

అన్ని డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన ఆగదు

  • 29న యథావిధిగా పార్లమెంట్‌కు ట్రాక్టర్‌ ‌మార్చ్
  • ‌రైతు సంఘం నేత తికాయత్‌ ‌వెల్లడి

సాగు చట్టాల రద్దు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు..తమ మిగిలిన డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 29వ తేదీన 60 ట్రాక్టర్లతో పార్లమెంటు వరకూ మార్చ్ ‌నిర్వహించనున్నట్టు భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (‌బీకేయూ) నేత రాకేష్‌ ‌తికాయత్‌ ‌బుధవారంనాడు తెలిపారు. పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించడం సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఈ ట్రాక్టర్స్ ‌మార్చ్ ‌నిర్వహంచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం తెరిచి ఉంచిన రోడ్ల వి•దుగానే ట్రాక్టర్లు పార్లమెంటు వరకూ వెళ్తాయన్నారు. ‘మేము రోడ్లు దిగ్బంధం చేస్తున్నామనే ఆరోపణలకు తావీయం. రోడ్లు దిగ్బంధించడం మా ఉద్యమం కాదు.

ప్రభుత్వంతో చర్చించడమే మా ఉద్యమం ఉద్దేశం. మేము నేరుగా పార్లమెంటుకు వెళ్తాం‘ అని రాకేష్‌ ‌తికాయత్‌ ‌తెలిపారు. సుమారు వెయ్యి మంది వరకూ పార్లమెంటుకు వెళ్తునన్నట్టు ఆయన చెప్పారు. కనీస మద్దతు ధరపై ప్రభుత్వ స్పందన గురించి వేచిచూస్తున్నామని, దానికి తోడు ఏడాదిగా సాగించిన రైతు నిరసనల్లో 750 వరకు రైతులు చనిపోవడానికి కేంద్రం బాధ్యత తీసుకోవాలని తికాయత్‌ అన్నారు.

Leave a Reply