బిజెపి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నాయకులను కరోనావైరస్ వ్యాప్తికి మతం రంగు పులుమ వద్దు అని హెచ్చరించారు. గురువారం నాడు సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయంలో పధాదికారులతో జరిగిన సమావేశంలో బిజెపి అధ్యక్షుడు జె పి నడ్డా, పార్టీ నాయకులేవరు కూడా రెచ్చగొట్టే లేదా విభజన రేఖలు పొడచూపే వ్యాఖ్యలు చేయకూడదని అంటూనే ప్రధాని ప్రయత్నాలకు మద్దతు కోసం కూడా జేపీ నడ్డా కోరినట్లు పార్టీ నాయకులూ చెబుతున్నారు.
బిజెపి అధ్యక్షుడు జె పి నడ్డా తన పార్టీ నాయకులను కోవిడ్ -19 వ్యాప్తిపై మతపరమైన రంగు పులమడం లేదా విభజన సృష్టించే వ్యాఖ్యలు చేయకుండా ఉండమని కోరినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా 400 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు 15 కరోనా మరణాలు నమోదయ్యాక జేపీ నడ్డా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల తో సమావేశమయ్యారు.మార్చి మధ్యలో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిఘి జమాత్ సమావేశాన్ని అధికారులు గుర్తించారు. అటుపై జరిగిన పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఇలా మా ట్లాడారు.