Take a fresh look at your lifestyle.

ఇం‌టర్‌ ‌పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

ఇం‌టర్‌ ‌పరీక్ష కేంద్రాలలో ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణం తో పాటు ప్రథ•మ చికిత్స ఏర్పాట్లు చేయాలి అని జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష అన్నారు. బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్‌ ‌పరీక్ష కేంద్రాలలో విద్యార్థుల కోసం ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణం తో పాటు పారాచూటమల్‌ ‌ట్యాబ్లెట్లు, ఇతర ప్రాథమిక మందులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.బుధవారం ఆమె వనపర్తి పట్టణంలోని స్కాలర్స్, ‌సివి రామన్‌ ‌జూనియర్‌ ‌కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ ‌మొదటి సంత్సరం పరీక్ష కేంద్రాలని తనిఖీ చేసి సౌకర్యాలను, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల హాజరు ప్రశ్నపత్రాలు సమయం ప్రకారం పరీక్షల ప్రారంభం తదితర వివరాలను జిల్లా ఇంటర్‌ ‌పరీక్షల అధికారి సింహయ్య ద్వారా అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలని కోరారు.కాగా ఇంటర్‌ ‌పరీక్షలకు జిల్లా నుండి మొత్తం 15269 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

ఇందుకుగాను 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 24 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, 13 మంది అదనపు ఛీఫ్‌ ‌సూపరింటిండెంట్లను నియమించారు. ఒక ఫ్లైయింగ్‌ ‌స్క్వాడ్‌, 2 ‌సిట్టింగ్‌ ‌స్క్వాడ్‌ ‌లను నియమించారు. 460 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మొదటి రోజు పరీక్షలకు 7967 మంది విద్యార్థులు హాజరు కాగా 300 మంది గైర్హాజరయ్యారు. మొదటిరోజు జిల్లాలో ఇంటర్‌ ‌పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్‌ ‌విద్యాశాఖ అధికారి సింహయ్య తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy