Take a fresh look at your lifestyle.

అనంతలో 200 పడకలతో ఆక్సిజన్‌ ‌బెడ్స్

తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు పూర్తి
ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్‌ ‌గంధం చంద్రుడు
అనంతపురము, : అనంతపురం పట్టణంలో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద 200 ఆక్సిజన్‌ ‌పడకల కోవిడ్‌ ‌తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ ‌గంధం చంద్రుడు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన అనంతరం తాత్కాలిక ఆసుపత్రిని ప్రారంభించనున్నామన్నారు. శుక్రవారం ఉదయం తాత్కాలిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ ‌పరిశీలించారు. 150 మంది వైద్య సిబ్బంది, ఆక్సిజన్‌ ‌కాంసెంట్రేటర్లు అమర్చిన పడకలు, కోవిడ్‌ ‌బాధితులకు , సిబ్బందికి అవసరమయ్యే శానిటేషన్‌ ‌వసతులతో కోవిడ్‌ ‌తాత్కాలిక ఆసుపత్రి వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండటంపై కలెక్టర్‌ ‌సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు శాఖల అధికారులు అంకితభావంతో, ధృడ సంకల్పంతో పనిచేయడం వల్లే ఆసుపత్రి నిర్మాణం కేవలం రెండు వారాల వ్యవధిలోనే పూర్తయిందన్నారు.ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ‌కాన్సెంట్రేటర్ల పనితీరును కలెక్టర్‌ ‌పరిశీలించారు. సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొంది ప్రమాద తీవ్రత తగ్గిన బాధితులకు కాంసెంట్రేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అం‌దించనున్నామన్నారు.

300 పడకల వరకూ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న తాత్కాలిక ఆసుపత్రి ప్రస్తుతానికి సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రికి స్పెప్‌ ‌డౌన్‌(అనుబంధ) ఆసుపత్రిగా పని చేయనుందన్నారు. భవిష్యత్తులో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచుకున్న అనంతరం పైపు లైను ద్వారా ఆక్సిజన్‌ అం‌దించేందుకు కావాల్సిన వసతులను కూడా ఏర్పాటు చేశామన్నారు.అనంతరం డియాతో మాట్లాడుతూ జిల్లాలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసు ఒక్కటి కూడా నిర్దారణ కాలేదన్నారు. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌తీవ్రత దృష్ట్యా పరిస్థితి చేయి దాటక ముందే అదుపులో పెట్టేందుకు అనుమానితులను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైందన్నారు.

అందులో భాగంగా 60కి పైగా అనుమానితులను గుర్తించి వారికి టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన టెస్టుల్లో ఒక్కరికి కూడా బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌నిర్దారణ కాలేదన్నారు. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌గురించి జిల్లా ప్రజలు భయపడొద్దని, బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కు చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామన్నారు.తాత్కాలిక ఆసుపత్రి పరిశీలనలో జిల్లా కలెక్టరు వెంట జయింట్‌ ‌కలెక్టర్‌ ఏ.‌సిరి(అభివృద్ధి), డీఎంహెచ్‌ఓ ‌కామేశ్వర్‌ ‌ప్రసాద్‌, ‌తాత్కాలిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డా.గంగి రెడ్డి, జీఎం ఇండస్ట్రీ అజయ్‌ ‌కుమార్‌, ‌డిఈవో శామ్యూల్‌, ఏపీఎస్‌ఎమ్‌ఐడీసీ ఈఈ, సీపీవో ప్రేమ్‌ ‌చంద్ర, డ్రగ్స్ ఏడీ రమేశ్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply