Take a fresh look at your lifestyle.

ఖమ్మంను గజ గజ వణికిస్తున్న చలి

winter season, fog, khammamనగరంలో ఇటీవలే తగ్గినట్టు తగ్గిన చలి మరల విైంభించింది. సంక్రాంతి ముందు చలి విపరీతంగా పెరుగుతుందని అంటారు. ఈ విధంగా చలి అందుకే పెరుగుతుందేమో. గత రెండు రోజులుగా వాతావరణంలో చాలా మార్పులు రావటంతో చలిగాలులు భూ ఉపరితలవైపు పయనించటం వల్ల ఈ చలి పెరిగిందని బావిస్తున్నారు.చలికి చర్మం పూర్తిగా చల్లబడటం, ఏ వస్తువు పట్టుకున్నా చలి షాక్‌ ‌కొట్టడం ముఖ్యంగా బిందెల్లో నీరు పట్టుకున్న అతి చల్లగా ఉండటంతో ప్రజలు ఈ చలి నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు ఇక ైధ్దులు, చంటిపిల్లల పరిస్తితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎముకలు కొరికే చలిలో బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తప్పని సరి పరిస్తితిల్లో బయటకు వెళ్లిన వారు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. ఉదయం పూట ఎండలో గంటలకు గంటలు కూర్చున్న చలి ప్రభావం తగ్గుముఖం పట్టటం లేదు. ఆసుపత్రులు శీతకాలపు వ్యాధుల బారిన పడి వచ్చే రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయపు నడక సాగించేవారికి ఈ చలి తీవ్రత మరింతగా ఇబ్బంది పెడుతుంది. ఈ చలి తీవ్రత వల్ల ఇళ్లల్లో కనీసం ఫ్యాన్లు వేసుకునేవారే లేరు. చలి తీవ్రత పెరిగినందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అదికారులు ప్రజలను కోరుతున్నారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచిస్తున్నారు.

Tags: winter season, fog, khammam

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply