Take a fresh look at your lifestyle.

ఒక వంశం ప్రతిష్ఠ మసకబారుతోంది

“వంశపారంపర్య రాజకీయాలు పూర్తిగా అంతరించి పోయాయని ఎలా చెప్పగలరు జ్యోతిరాదిత్యసింధియా త్వరలోనే బీజేపీ తరఫున కేంద్రమంత్రిగా చేపట్టనున్న తరణంలో ఈ దేశంలో వంశ పారంపర్య రాజకీయాలు అంతరించాయని ఎలా చెప్పగలరు. జ్యోతిరాదిత్య సింధియా వారి వంశంలో రాజకీయాలలో ఐదవవారు. నిజానికి ఆయన సింధియా వంశంలో మూడవ తరంవారు. ఆయన నాయనమ్మ రాజమాత విజయరాజేసింధియా, మేనత్తలు వసుంధరారాజే, యశోదరారాజే,బావ దుష్యంత్‌ ‌మొదలైనవారందరని కలుపుకుంటే రాజకీయాల్లో సింధియాల వంశవృక్షం చాలా పెద్దదే ఉంది. వీరిలో చాలా మంది కాంగ్రెస్‌ను దెబ్బదీశారు. 2012 తర్వాత ఏ రాజకీయవేత్తనైనా అడగండి ఎన్నికల్లో ఎవరు పోటీ చేశారని రాజ్యసభ జాబితా పరిశీలిస్తే తెలుస్తుంది. వంశపారంపర్య రాజకీయాలు కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్నట్టు ముద్ర పడింది. ఇదే విషయాన్ని 2013లో రాహుల్‌ ‌గాంధీ జైపూర్‌లో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.”

గాంధీ,కాంగ్రెస్‌ల గురించి ఆనాడే చెప్పాను గాంధీ కుటుంబం ఇక ఎంత మాత్రం ఓట్లను సాధించలేదని 2013 ఫిబ్రవరిలోనే నేను స్పష్టం చేశాను. ఇప్పుడు సింధియా తుపానుతో అది నిజమైంది. వ్యక్తుల ఆకర్షణ కన్నా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం లభిస్తోంది. 2013 ఫిబ్రవరిలో నేను జాతీయ ప్రయోజనాల పతాక శీర్షికతో కొన్ని ప్రశ్నలు సంధించాను. ఒక వంశం ప్రతిష్ఠ మసకబారుతోంది. గడిచిన దశాబ్దంగా రాజకీయాలలో మౌలికమైన వచ్చిన మార్పు ఏమిటి ఏది రాలేదు. ఏది తీవ్రంగా, నాటకీయంగా మారింది. అయినప్పటికీ పాతతరం, పరిచయం ఉన్న వ్యక్తులు కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రశ్నలకు నేనే సమాధానం చెప్పాను ఏమని అంటే వంశపారంపర్య రాజకీయాలని. ఈ ప్రశ్నను మళ్ళీ అడగవచ్చు. ఇప్పుడు కూడా సమాధానం అదే. అయితే, అనువంశిక రాజకీయాలు పడిపోతున్నాయి. కాని వీటి వేళ్ళు లోతైనవి. కాంగ్రెస్‌,‌బీజేపీ అనువంశిక రాజకీయాలు ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయాయి. వంశపారంపర్య రాజకీయాలు పూర్తిగా అంతరించి పోయాయని ఎలా చెప్పగలరు జ్యోతిరాదిత్యసింధియా త్వరలోనే బీజేపీ తరఫున కేంద్రమంత్రిగా చేపట్టనున్న తరణంలో ఈ దేశంలో వంశ పారంపర్య రాజకీయాలు అంతరించాయని ఎలా చెప్పగలరు. జ్యోతిరాదిత్య సింధియా వారి వంశంలో రాజకీయాలలో ఐదవవారు. నిజానికి ఆయన సింధియా వంశంలో మూడవ తరంవారు. ఆయన నాయనమ్మ రాజమాత విజయరాజేసింధియా, మేనత్తలు వసుంధరారాజే, యశోదరారాజే,బావ దుష్యంత్‌ ‌మొదలైనవారందరని కలుపుకుంటే రాజకీయాల్లో సింధియాల వంశవృక్షం చాలా పెద్దదే ఉంది. వీరిలో చాలా మంది కాంగ్రెస్‌ను దెబ్బదీశారు.

2012 తర్వాత ఏ రాజకీయవేత్తనైనా అడగండి ఎన్నికల్లో ఎవరు పోటీ చేశారని రాజ్యసభ జాబితా పరిశీలిస్తే తెలుస్తుంది. వంశపారంపర్య రాజకీయాలు కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్నట్టు ముద్ర పడింది. ఇదే విషయాన్ని 2013లో రాహుల్‌ ‌గాందీ జైపూర్‌లో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. గాంధీల పర్యటనల్లో ఇది ఎంతో మేలు చేసేది. వారి అర్హతలను మించి వారు రాయబరేలీ,అమేథీ వంటి నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు తోడ్పడింది. గాంధీ కుటుంబ సభ్యులకు పార్టీలో ఇంత ప్రాధాన్యత ఇప్పటికి లభించడానికి కారణం ఏమిటని నేను ఒక నాయకుణ్ణి అడిగాను. అందరినీ కలిపి ఉంచే శక్తి ఆ కుటుంబ వారసులకు ఉందని అతడు సమాధానమిచ్చాడు రాహుల్‌ ఏదైనా చెబితే అందరూ అదే దారిలో నడుస్తారు. పీవీ, సీతారామ్‌కేసరి వంటివారు చెబితే పార్టీలో తిరుగుబాటు వస్తుంది. పార్టీ అధ్యక్ష పదవిని అంగీకరిస్తూ రాహుల్‌ ‌చేసిన ప్రసంగాన్ని బట్టి ఆయనను అంచనా వేయవచ్చు. కాంగ్రెస్‌ ‌వంశ రాజకీయాలు గతంలో కన్నా బలంగా ఉన్నాయని అన్నారు. 1996 నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా బలంగా ఉన్నాయని అన్నారు. అయితే,వంశపారంపర్య రాజకీయాలు అన్ని పార్టీల్లో వచ్చాయి. కాశ్మీర్‌లో అబ్దుల్లాలు, పంజాబ్‌లో బాదల్స్, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్‌,ఆం‌ద్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు, వైఎస్‌ ‌కుటుంబాలు, కర్నాటకలో గౌడలు,ఒడిషాలో పట్నాయక్‌లు, మేఘాలయలో సంగ్మాలు,ఇలా అన్ని పార్టీలలో వచ్చాయి. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానిస్తూ తన తండ్రి దేవెగౌడ ప్రధానమంత్రి పదవిని అంగీకరించి తప్పు చేశారనీ, ఆయన కర్నాటక ముఖ్యమంత్రిగానే కొనసాగి ఉంటే, తమ కుటుంబవారసులకు పదవి దక్కేదని అన్నారు.

- Advertisement -

ఆ తర్వాత ఆ పదవి దక్కించుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సివచ్చిందని ధ్వనించే రీతిలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును ప్రాంతీయపార్టీల నాయకులు కైవసం చేసుకున్నారు.అందువల్లనే ప్రాంతీయ పార్టీల హవా పెరిగింది. డిఎంకె నుంచి నేర్చుకోవల్సింది ఎంతో ఉందని కుమారస్వామి అన్న మాటల్లో ఎంతో నిజం ఉంది. ఆ పార్టీ తమిళనాడు దాటి రాలేదు. దేశంలో 15 పైగా ప్రాంతీయ పార్టీల నాయకులు తమ వారసులను అప్పుడే ఎంపిక చేసుకున్నారు. గాంధీ- నెహ్రూ కుటుంబం ఇప్పుడు దేశంలో అన్ని ప్రాంతాల్లో పట్టుకలిగి లేదు. ఆ పార్టీ నాయకులు పొత్తు లేనిదే గెలిచే పరిస్థితి లేదు. వారు తమ నియోజకవర్గాలను మించి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే స్థితిలో లేరు. అందువల్ల గాంధీ కుటుంబం పేరు చెబితే ఓట్లు రాలే పరిస్థితి లేదు.
-‌శేఖర్‌గుప్త, ద ప్రింట్‌ ‌సౌజన్యంతో

Tags: Abdullah in Kashmir, Badals in Punjab, Uttar Pradesh

Leave a Reply